ఓక్రిడ్జ్‌కు రెండు టైటిళ్లు | Oakridge International School gets Two Football Titles | Sakshi
Sakshi News home page

ఓక్రిడ్జ్‌కు రెండు టైటిళ్లు

Feb 11 2019 10:14 AM | Updated on Feb 11 2019 10:14 AM

Oakridge International School gets Two Football Titles - Sakshi

రాయదుర్గం: హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ ప్రీమియర్‌ లీగ్‌ కప్‌లో ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది. అండర్‌–13, 15 విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను హస్తగతం చేసుకుంది. అండర్‌–13 బాలుర ఫైనల్లో ఓక్రిడ్జ్‌ 2–1తో ఫ్యూచర్‌ కిడ్స్‌పై విజయం సాధించింది. అండర్‌–15 తుదిపోరులో 2–1తో గోల్కొండ స్కూల్‌ను ఓడించింది. మూడు నెలల పాటు సాగిన ఈ టోర్నీ ఆసాంతం రాణించిన కొత్లూరి విశాల్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది టోర్నీ’ అవార్డును గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా రెండు కేటగిరీల్లో విజేతగా నిలిచిన ఓక్రిడ్జ్‌ జట్టును స్కూల్‌ ప్రిన్సిపాల్‌ అర్జున్‌రావు, స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌ డేవిడ్‌ రాజ్‌కుమార్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement