వెటోరి జెర్సీకి కివీస్‌ గుడ్‌బై | NZC Retires Daniel Vettori Jersey | Sakshi
Sakshi News home page

వెటోరి జెర్సీకి కివీస్‌ గుడ్‌బై

Aug 6 2019 9:20 AM | Updated on Aug 6 2019 9:20 AM

NZC Retires Daniel Vettori Jersey - Sakshi

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ క్రికెట్‌ (ఎన్‌జడ్‌సీ) తమ దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్‌ డానియెల్‌ వెటోరీ సేవలకు చక్కని గుర్తింపునిచ్చింది. అతని జెర్సీ నంబర్‌ ‘11’కు రిటైర్మెంట్‌ ఇచ్చేసింది. దీంతో ఇక భవిష్యత్తులో ఏ కివీ క్రికెట్‌ర్‌ జెర్సీ మీద ఈ నంబర్‌ కనిపించదు. ‘200పైగా వన్డేలకు ప్రాతినిధ్యం వహించిన జెర్సీ నంబర్‌కు రిటైర్మెంట్‌ ఇచ్చేశాం. వెటోరి 11 జెర్సీతో 291 మ్యాచ్‌లాడి అత్యధిక వన్డేలాడిన న్యూజిలాండ్‌ క్రికెటర్‌గా నిలిచాడు’ అని ఎన్‌జడ్‌సీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌ కోసం తమ ఆటగాళ్ల జెర్సీ నంబర్లను ప్రకటించింది. రెండు టెస్టుల ఈ సిరీస్‌ ఈ నెల 14 నుంచి గాలే (శ్రీలంక)లో జరుగుతుంది. ఇక్కడి నుంచే కివీస్‌ ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ మొదలవుతుంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement