ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులకు శుభవార్త | Daniel Vettori provides massive update on Nitish Kumar Reddy injury ahead of PBKS clash | Sakshi
Sakshi News home page

ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులకు శుభవార్త

May 5 2026 7:17 PM | Updated on May 5 2026 7:36 PM

Daniel Vettori provides massive update on Nitish Kumar Reddy injury ahead of PBKS clash

ఐపీఎల్‌ 2026లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో రేపు (మే 6) జరుగబోయే కీలక మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులకు శుభవార్త అందింది. అనారోగ్యం కారణంగా కేకేఆర్‌ మ్యాచ్‌కు దూరమైన స్టార్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి కోలుకున్నాడని తెలుస్తోంది. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని సమాచారం. ఈ విషయంపై జట్టు కోచ్‌ డేనియల్‌ వెటోరీ క్లారిటీ ఇచ్చాడు.

కాగా, నితీశ్‌ స్థానంలో కేకేఆర్‌ మ్యాచ్‌లో బరిలోకి దిగిన స్మరణ్‌ రవిచంద్రన్‌ (4) ఘోరంగా విఫలమయ్యాడు. ఆ మ్యాచ్‌లో నితీశ్‌ లేని లోటు స్పష్టంగా కనిపించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో దారుణంగా విఫలమైన సన్‌రైజర్స్‌ 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ గెలిచి ఉంటే, ప్లే ఆఫ్స్‌ రేసులో మిగతా జట్లకంటే ముందుండేది.

ప్రస్తుతం ఆ జట్టు 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పంజాబ్‌ (13), ఆర్సీబీ (9 మ్యాచ్‌ల్లో 12) తర్వాత  పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. రాజస్థాన్‌, గుజరాత్‌కు  సైతం తలో 12 పాయింట్లు ఉన్నప్పటికీ.. రన్‌రేట్‌ పరంగా సన్‌రైజర్స్‌ కాస్త మెరుగ్గా ఉంది. ప్రస్తుతం పంజాబ్‌, ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌ పాయింట్ల పట్టికలో టాప్‌-5లో ఉండి ప్లే ఆఫ్స్‌ రేసులో ముందున్నాయి. ఇకపై ఈ జట్లకు ప్రతి మ్యాచ్‌ కీలకంగా ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement