సైనాకు చుక్కెదురు.. కాంస్యంతో సరి! | Nozomi Okuhara beats saina in BWF semis | Sakshi
Sakshi News home page

సైనాకు చుక్కెదురు.. కాంస్యంతో సరి!

Aug 26 2017 7:59 PM | Updated on Sep 17 2017 5:59 PM

సైనాకు చుక్కెదురు.. కాంస్యంతో సరి!

సైనాకు చుక్కెదురు.. కాంస్యంతో సరి!

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌ కు చుక్కెదురైంది.

గ్లాస్గో: ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌ కు చుక్కెదురైంది. మహిళల సెమీఫైనల్స్‌ సింగిల్స్‌లో సైనా నెహ్వాల్‌ నిరాశ పరిచింది. జపాన్‌ షట్లర్‌ నొజోమి ఒకుహర చేతిలో పరాజయం పాలైంది. దీంతో సైనా కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తొలి గేమ్‌లోని దూకుడును మిగిలిన రెండు గేమ్ ల్లో ప్రదర్శించలేక ప్రత్యర్ధికి మ్యాచ్ అప్పగించింది.

తొలి గేమ్‌లో 21-12తో విజయం సాధించిన సైనా ఆ తర్వాత కొన్ని అనవసర తప్పిదాలు చేయడంతో రెండో గేమ్ ను 17-21తో కోల్పోయింది. నిర్ణయాత్మక మూడో గేమ్ లో సైనా మరింత నిరాశపరుస్తూ 10-21తో గేమ్ తో పాటు మ్యాచ్ ను కోల్పోయింది. క్వార్టర్స్ లో స్కాట్లాండ్‌ క్రీడాకారిణి గిల్‌మార్‌పై 21-19, 18-21, 21-15 తేడాతో విజయం సాధించిన సైనా సెమీస్ లో మాత్రం తడబాటుకు గురై కాంస్యంతో సరిపెట్టుకుంది. మరో సెమీస్ కోసం సిద్ధంగా ఉన్న భారత షట్లర్ పీవీ సింధుపై కూడా ఎన్నో అంచనాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement