ఫెడరర్‌ అలవోకగా... | Novak Djokovic aura not dented after this happened at US Open | Sakshi
Sakshi News home page

ఫెడరర్‌ అలవోకగా...

Aug 30 2018 1:03 AM | Updated on Aug 30 2018 1:03 AM

Novak Djokovic aura not dented after this happened at US Open - Sakshi

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో టాప్‌స్టార్లంతా తొలిరౌండ్‌ను సులభంగానే అధిగమించారు. స్విట్జర్లాండ్‌ దిగ్గజం, ఐదు సార్లు యూఎస్‌ విజేత అయిన ఫెడరర్‌ 6–2, 6–2, 6–4తో జపాన్‌కు చెందిన యోషిహితో నిషిఒకాపై విజయం సాధించగా, ఏడో సీడ్‌ సిలిచ్‌ (క్రొయేషియా) 7–5, 6–1, 1–1తో ఆధిక్యంలో ఉన్న దశలో మారియస్‌ కొపిల్‌ (రొమేనియా) వైదొలిగాడు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్‌ వోజ్నియాకి (డెన్మార్క్‌) 6–3, 6–2తో స్టోసుర్‌ (ఆస్ట్రేలియా)పై గెలుపొందగా, నాలుగో సీడ్‌ కెర్బర్‌ (జర్మనీ) 7–6 (7/5), 6–3తో గాస్పర్యాన్‌ (రష్యా)ను ఓడించింది. మరో వైపు భారత నంబర్‌వన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ యూకీ బాంబ్రీ ఆట తొలిరౌండ్లోనే ముగిసింది. ప్రపంచ 96వ ర్యాంకర్‌ యూకీ 3–6, 6–7 (3/7), 5–7తో పీర్‌ హెర్బర్ట్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడాడు.  

ఎండతో పోరాడలేక...
సెర్బియన్‌ స్టార్‌ నోవాక్‌ జొకోవిచ్‌ యూఎస్‌ ఓపెన్‌ లో ఒంటిని పిండేసే ఎండతో విలవిల్లాడాడు. 38డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రతను తాళలేక రెండు సెట్లయ్యాక  చివరకు జొకో, అతని ప్రత్యర్థి మార్టన్‌ ఫుక్సోవిక్స్‌ (హంగేరి) మాకో పది నిమిషాల విశ్రాంతి కావాల్సిందేనంటూ కోర్టు బయటికొచ్చారు. అప్పుడు ఇద్దరు చెరో సెట్‌ గెలిచివున్నారు. కోర్టు పక్కనే జొకో, ఫుక్సోవిక్స్‌ చొక్కాలిప్పి ఐస్‌బాత్‌తో సేదతీరాకే మళ్లీ రాకెట్‌ పట్టారు. చివరకు సెర్బియన్‌ స్టార్‌ 6–3, 3–6, 6–4, 6–0తో ఫుక్సోవిక్స్‌పై నెగ్గాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement