ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ నిర్వహణ నుంచి జార్ఖండ్ తప్పుకుంది.
న్యూఢిల్లీ: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ నిర్వహణ నుంచి జార్ఖండ్ తప్పుకుంది. షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నుంచి 4 వరకు ఆ రాష్ట్ర రాజధాని రాంచీలో ఈ గేమ్స్ జరగాల్సి ఉంది. అయితే ఆర్థిక కారణాలతో నిర్వహణపై జార్ఖండ్ ప్రభుత్వం తమ అశక్తత తెలపడంతో ఒడిషాకు తరలివెళ్లే అవకాశం ఉంది.
ఇప్పటికే భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియాన్ని భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) ప్రతినిధుల బృందం పరిశీలించింది. మంగళవారం వేదికపై తుది నిర్ణయం తీసుకుంటామని ఏఎఫ్‌ఐ కార్యదర్శి సీకే వాల్సన్ తెలిపారు. గతంలో ఈ టోర్నీకి భారత్ రెండు సార్లు ఆతిథ్యమిచ్చింది. 1989లో తొలిసారిగా న్యూఢిల్లీలో జరగ్గా ఆ తర్వాత పుణే (2013) వేదికగా పోటీలు జరిగాయి.