'ఆ మ్యాచ్ తరువాత డిన్నర్ చేయలేదు' | None of us had dinner after India defeat, saysMashrafe Mortaza | Sakshi
Sakshi News home page

'ఆ మ్యాచ్ తరువాత డిన్నర్ చేయలేదు'

Apr 11 2016 9:53 PM | Updated on Sep 3 2017 9:42 PM

'ఆ మ్యాచ్ తరువాత డిన్నర్ చేయలేదు'

'ఆ మ్యాచ్ తరువాత డిన్నర్ చేయలేదు'

వరల్డ్ టీ 20లో భాగంగా టీమిండియాతో జరిగిన లీగ్ మ్యాచ్లో ఒక పరుగు తేడాతో ఓడిపోవడం తమ జట్టు మొత్తాన్ని తీవ్రంగా కలచివేసిందని బంగ్లాదేశ్ కెప్టెన్ మష్రాఫ్ మోర్తజా స్పష్టం చేశాడు.

శ్రీనగర్:వరల్డ్ టీ 20లో భాగంగా టీమిండియాతో జరిగిన లీగ్ మ్యాచ్లో ఒక పరుగు తేడాతో ఓడిపోవడం తమ జట్టు మొత్తాన్ని తీవ్రంగా కలచివేసిందని బంగ్లాదేశ్ కెప్టెన్ మష్రాఫ్ మోర్తజా స్పష్టం చేశాడు. ఆటలో గెలుపు-ఓటములు ఒక భాగమే అయినా, ఆ మ్యాచ్లో పరాజయం చెందుతామని  ఊహించనే లేదన్నాడు.  దీంతో ఆ రోజు జట్టులోని సభ్యులెవ్వరూ కనీసం డిన్నర్ కూడా చేయకుండా అలానే ఉండిపోయామన్నాడు.

హాలీ డే ట్రిప్లో భాగంగా కశ్మీర్లో ఉన్న మోర్తజా... ఆ మ్యాచ్ కు సంబంధించి స్థానిక యువకులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చాడు. 'భారత్తో ఓటమి చాలా నిరాశకు గురి చేసింది. మూడు బంతులు ఉండగా రెండు పరుగులు చేయలేక చతికిలబడ్డాం. ఒక పరుగుతో ఓటమి మరింత బాధించింది. ఆ మ్యాచ్లో విజయం చేతివరకూ వచ్చి చేజారింది. గెలుస్తామనుకున్న మ్యాచ్లో అనూహ్యంగా ఓటమి చెందాం. ఆ రాత్రి ఎవరూ డిన్నర్ కూడా చేయలేదు' అని మోర్తాజా చేదు జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement