సెమీస్‌ రేసులో కివీస్‌...  | New Zealand Womens Team Entered In Semi Finals In ICC T20 WC | Sakshi
Sakshi News home page

సెమీస్‌ రేసులో కివీస్‌... 

Mar 1 2020 2:59 AM | Updated on Mar 1 2020 2:59 AM

New Zealand Womens Team Entered In Semi Finals In ICC T20 WC - Sakshi

గ్రూప్‌ ‘ఎ’లోని మరో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 17 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీఫైనల్‌ రేసులో నిలిచింది. తొలుత న్యూజిలాండ్‌ 18.2 ఓవర్లలో 91 పరుగులకే ఆలౌటైంది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ 19.5 ఓవర్లలో 74 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కివీస్‌ బౌలర్లలో లే కాస్పెరెక్, హేలీ జేన్సన్‌ మూడేసి వికెట్లు తీశారు. ప్రస్తుతం గ్రూప్‌ ‘ఎ’ నుంచి భారత్‌ సెమీస్‌ వెళ్లగా... రెండో బెర్త్‌ కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ రేసులో ఉన్నాయి. సోమవారం ఈ రెండు జట్ల మధ్య జరిగే లీగ్‌ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. నేడు జరిగే గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌తో దక్షిణాఫ్రికా; ఇంగ్లండ్‌తో వెస్టిండీస్‌ తలపడతాయి.

Advertisement
 
Advertisement
Advertisement