ఒత్తిడి పెంచడంలో సక్సెస్ అయ్యాను | My role was to create pressure and I did well, says Mishra | Sakshi
Sakshi News home page

ఒత్తిడి పెంచడంలో సక్సెస్ అయ్యాను

Jul 28 2016 12:50 PM | Updated on Sep 4 2017 6:46 AM

ఒత్తిడి పెంచడంలో సక్సెస్ అయ్యాను

ఒత్తిడి పెంచడంలో సక్సెస్ అయ్యాను

వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో మూడు వికెట్లే తీసినా, జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించానని లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా పేర్కొన్నాడు.

జమైకా: వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో మూడు వికెట్లే తీసినా, జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించానని లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా పేర్కొన్నాడు. బ్యాటింగ్ లో రాణించిన మిశ్రా హాఫ్ సెంచరీ(53)తో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత పేసర్లు ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ చెరో నాలుగు వికెట్లతో చెలరేగగా, రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ అద్భుత ప్రదర్శన(7/83) తో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో ఉమేష్, షమీ వికెట్లు పడగొడుతుంటే విండీస్ ఆటగాళ్లపై మరో ఎండ్ నుంచి తాను మరింత ఒత్తిడి పెంచానని చెప్పాడు.

రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ చెలరేగుతుంటే మరో ఎండ్ లో అతనికి సహకారం అందించానన్నాడు. వ్యక్తిగతంగా రాణించలేరని, ఇతర బౌలర్లతో కలిసి ప్రత్యర్థి బ్యాట్స్ మన్లపై ఎదురుదాడికి దిగితే వికెట్లు సాధించడం సులభమని అభిప్రాయపడ్డాడు. అశ్విన్, తాను కలిసి నెలకొల్పిన సెంచరీ పైగా పరుగుల భాగస్వామ్యంతో భారత్ తమ తొలి ఇన్నింగ్స్ లో 550 పైచిలకు పరుగులు చేయగలిగిందని, తన ప్రదర్శనపై హర్షం వ్యక్తంచేశాడు. ప్రధాన ఆటగాళ్లతో పాటు టెయిలెండర్ల వికెట్లు తీయడంపై కూడా డ్రెస్సింగ్ రూములో చర్చించినట్లు అమిత్ మిశ్రా వివరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement