వైరల్‌ : బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ నాగిని డ్యాన్స్‌! | Mushfiqur Rahim Celebrates With A Nagin Dance | Sakshi
Sakshi News home page

Mar 11 2018 11:13 AM | Updated on Mar 11 2018 11:13 AM

Mushfiqur Rahim Celebrates With A Nagin Dance - Sakshi

కొలంబో : నిదహాస్‌ ట్రోఫీలో భాగంగా శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ బ్యాట్స్‌మన్‌ ముష్ఫికర్ రహీమ్‌ నాగిని డ్యాన్స్‌తో అలరించాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టుకు  చారిత్రాత్మక విజయం అందించిన ఈ బంగ్లా ఆటగాడు పట్టరాని సంతోషంతో నాగిని డ్యాన్స్‌తో చిందేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తుంది.

ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌, శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ముష్ఫికర్‌ బ్యాటింగ్‌ ప్రదర్శనతో పాటు నాగిని డ్యాన్స్‌ సైతం అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ బంగ్లా క్రికెటర్‌ను ప్రశంసిస్తూ నెటిజన్లు వరుస ట్వీట్లు పోస్ట్‌ చేస్తున్నారు. 

‘నీ ప్రదర్శనతో మా మనసులు గెలుచుకున్నావు,’ అని ఒకరంటే.. ముష్పికర్‌ నీ డ్యాన్స్‌ ఇప్పటి వరకు చూడలేదని మరొకరు.. ఇండియన్‌ నాగిని డ్రామాలా ఉందని ఇంకొకరు ట్వీట్‌ చేస్తున్నారు.

ముష్ఫికర్‌ రహీమ్‌ (35 బంతుల్లో 72 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), లిటన్‌ దాస్‌ (19 బంతుల్లో 43; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు)ల వీరోచిత ఆటతో ఆతిథ్య శ్రీలంకపై బంగ్లాదేశ్‌  చరిత్రలో రికార్డు ఛేదన నమోదు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement