అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) తాజాగా ప్రకటించిన బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్లు సత్తాచాటారు. ఇటీవల సొంతగడ్డపై పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సీనియర్ బ్యాటర్లు ముష్ఫికర్ రహీమ్, బ్యాటర్ లిట్టన్ దాస్ తమ ర్యాంక్‌లను భారీగా మెరుగు పరుచుకున్నారు.
ముష్పికర్ తాజా ర్యాంకింగ్స్‌లో 10 స్థానాలు ఎగబాకి సంయుక్తంగా 16వ స్థానానికి చేరుకున్నాడు. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో రహీమ్ 259 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అదేవిధంగా ఈ సిరీస్‌లో 239 పరుగులు చేసిన లిట్టన్ దాస్ 14 స్థానాలు మెరుగుపరుచుకుని 24వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు.
అదేవిధంగా పాక్‌తో తొలి టెస్టులో మెరుగైన ప్రదర్శన చేసిన బంగ్లా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తైజుల్, బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 11వ స్థానాన్ని దక్కించుకున్నాడు. మరోవైపు స్టార్ స్పిన్నర్ మెహిదీ హసన్ మిరాజ్ 2 స్థానాలు మెరుగుపరుచుకుని 25వ ర్యాంకుకు చేరగా, యువ ఫాస్ట్ బౌలర్ నహీద్ రాణా 10 స్థానాలు ఎగబాకి 54వ స్థానంలో నిలిచాడు.
బ్యాటర్ల టాప్ ర్యాంక్‌లో ఇంగ్లండ్ లెజెండ్ జో రూట్ కొనసాగుతుండగా.. బౌలర్ల విభాగంలో జస్ప్రీత్ బుమ్రా అగ్రస్ధానంలో ఉన్నాడు. ఇక వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 131 రేటింగ్‌తో టాప్‌లో ఉంది. తర్వాతి రెండు స్ధానాల్లో సౌతాఫ్రికా, భారత్ ఉన్నాయి.


