సచిన్ రికార్డుపై కన్నేసిన ధోనీ! | MS Dhoni need 3 sixes to cross Tendulkar's ODI record | Sakshi
Sakshi News home page

సచిన్ రికార్డుపై కన్నేసిన ధోనీ!

Oct 20 2016 8:49 AM | Updated on Sep 4 2017 5:48 PM

సచిన్ రికార్డుపై కన్నేసిన ధోనీ!

సచిన్ రికార్డుపై కన్నేసిన ధోనీ!

టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు.

ఢిల్లీ: టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. దాంతో పాటు మరిన్ని రికార్డులు ధోనీని ఊరిస్తున్నాయి. నేటి మ్యాచ్ లో ధోనీ బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ నమోదైతే ఆ రికార్డులు సులువగా సాధిస్తాడు. ఆ రికార్డులు ఏంటంటే.. వన్డేల్లో ధోనీ మరో మూడు సిక్స్ లు కొడితే సచిన్(195 సిక్సర్లు) రికార్డును అధిగమిస్తాడు. అదే విధంగా 7 సిక్స్ లు కొడితే వన్డేలలో 200 సిక్సర్ల రికార్డును నమోదు చేసిన భారత తొలి ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు.

ఎంఎస్ ధోనీ మరో 61 పరుగులు సాధిస్తే వన్డేల్లో 9 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. కెరీర్ లో 279 వన్డేలు ఆడిన ధోనీ 8,939 పరుగులు చేశాడు. మరికొంత కాలం వన్డేల్లో కొనసాగే అవకాశం ఉన్నందున పదివేల క్లబ్ లో చేరే అవకాశం ధోనీకి ఉంది. ఇక్కడి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో నేటి మధ్యాహ్నం 1:30 గంటలకు న్యూజిలాండ్-భారత్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో భారత సారథి ధోనీ రికార్డులపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కివీస్ పై విరాట్ కోహ్లీ నేతృత్వంలో టెస్ట్ సిరీస్ ను 3-0తో క్లీన్ స్విప్ చేసిన టీమిండియా, ప్రస్తుతం ధోనీ నాయకత్వంలో తొలి వన్డేలో కివీస్ పై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement