కోహ్లీ కెప్టెన్సీ ఆశలు గల్లంతు! | MS Dhoni as indian captain for first test against australia! | Sakshi
Sakshi News home page

కోహ్లీ కెప్టెన్సీ ఆశలు గల్లంతు!

Dec 6 2014 4:42 PM | Updated on Sep 2 2017 5:44 PM

కోహ్లీ కెప్టెన్సీ ఆశలు గల్లంతు!

కోహ్లీ కెప్టెన్సీ ఆశలు గల్లంతు!

టెస్టు జట్టుకు తొలిసారి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాలనుకున్న టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ ఆశలు గల్లంతయ్యినట్లే స్పష్టమవుతోంది.

ముంబై: టెస్టు జట్టుకు తొలిసారి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాలనుకున్న టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ ఆశలు గల్లంతయ్యినట్లే కనబడుతోంది. ఈ నెల 9 వ తేదీ నుంచి అడిలైడ్ లో జరిగే తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సిద్దం కావడంతో కోహ్లీ కెప్టెన్సీ ఆశలకు గండిపడే అవకాశం ఏర్పడింది. ముందు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం తొలిటెస్టు డిసెంబర్ 4 వ తేదీన బ్రిస్బేన్ లో జరగాలి. ధోనీ చేతికి గాయం కావడంతో తొలిటెస్టు బాధ్యతలను కోహ్లీకి అప్పచెబుతూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

 

ఆసీస్ క్రికెటర్ ఫిలిఫ్ హ్యూస్ మరణంతో మొత్తం షెడ్యూల్ మొత్తం సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకోవడంతో ఆ టెస్టు 9 వ తేదీకి వాయిదా పడింది. ఈలోపు తొలిటెస్టుకు ధోనీ సిద్దం కావడంతో పాటు ఫిట్ నెస్ పరీక్షల్లో పాస్ కావడంతో కోహ్లీ టెస్టు కెప్టెన్సీ ఆశ  ఇప్పట్లో నెరవేరేటట్లు కనబడుట లేదు.

Advertisement
 
Advertisement
Advertisement