ధోని ఇక.. కబడ్డీ కబడ్డీ! | MS Dhoni Shows His Skills On The Kabaddi Floor In PKL | Sakshi
Sakshi News home page

Nov 13 2018 9:52 PM | Updated on Nov 13 2018 10:17 PM

MS Dhoni Shows His Skills On The Kabaddi Floor In PKL - Sakshi

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనికి కాస్త విరామం దొరికినా వినూత్నంగా గడపాలనుకుంటాడు. తనకిష్టమైన ఫుట్‌బాల్‌ ఆడటం, కూతురు జీవాతో ఆడుకోవడం, కుక్కలతో క్యాచ్‌ ప్రాక్టీసింగ్‌ చేయించడం, స్నేహితులతో బైక్‌ రైడింగ్‌లు, పార్టీలతో ధోని ఎంజాయ్‌ చేస్తుంటాడు. అయితే, ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20 సిరీస్‌కు మిస్టర్‌ కూల్‌ ఎంపిక కాకపోవడంతో అతనికి విరామం దొరికింది. ఇక ఈ గ్యాప్‌లో ప్రో కబడ్డీ లీ గ్‌ (పీకేఎల్‌)లో కబడ్డీ కూత మొదలెట్టాడు.

కానీ,  ప్రొఫెషనల్‌ ఆటగాడిగా కాదు.. కేవలం పీకేఎల్‌ ప్రమోషన్‌లో భాగంగా కబడ్డీ ఆటగాడిగా అవతారమెత్తాడు. దీనికి సంబంధించి ధోని స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ రితీ స్పోర్ట్స్‌ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ధోని కబడ్డీ ఆడుతున్న ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇక తన కలల కబడ్డీ జట్టులో ధోనికి ఢిఫెండర్‌గా అవకాశమిస్తాననీ.. ఏ రంగంలోనైనా అతడికంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకునే అలవాటుందని గతంలో క్రికెట్‌ దిగ్గజం, తమిళ్‌ తలైవాస్‌ జట్టు సహ యజమాని సచిన్‌ టెండూల్కర్‌ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.

ఇక స్వదేశంలో జరిగిన వెస్టిండీస్‌ సిరీస్‌లో ధోనిని తప్పించిన విషయం తెలిసిందే. ఆసీస్‌తో ఈ నెలాఖరున జరగబోయే టీ20 సిరీస్‌కు సైతం సెలెక్టర్లు ధోనిని ఎంపిక చేయలేదు. అతని స్థానంలో యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌కు అవకాశమిస్తున్నట్టు తెలిపారు. దీనిపై ధోని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. మాజీ క్రికెటర్లు మిశ్రమంగా స్పందించారు. ఇప్పటికే టెస్టులకు గుడ్‌బై చెప్పిన ధోని, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఈ తరుణంలో ధోనిని సెలక్టర్లు టీ20 నుంచి తప్పిండంతో అతని కెరీర్‌ చరమాంకంలో పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement