రియో ఒలింపిక్స్‌ను తరలించండి | Move the Rio Olympics | Sakshi
Sakshi News home page

రియో ఒలింపిక్స్‌ను తరలించండి

May 29 2016 12:23 AM | Updated on Sep 4 2017 1:08 AM

జికా వైరస్ కారణంగా ఆగస్టులో జరగనున్న రియో ఒలింపిక్స్‌ను తరలించడం లేదా ఆలస్యంగా నిర్వహించడం చేయాలని....

అంతర్జాతీయ నిపుణుల విజ్ఞప్తి

మియామీ: జికా వైరస్ కారణంగా ఆగస్టులో జరగనున్న రియో ఒలింపిక్స్‌ను తరలించడం లేదా ఆలస్యంగా నిర్వహించడం చేయాలని అంతర్జాతీయ డాక్టర్లు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు 150 మంది అంతర్జాతీయ నిపుణులు ఓ లేఖపై సంతకాలు చేశారు. ప్రస్తుతం గేమ్స్‌కు ఆతిథ్యమిస్తున్న రియో.... బ్రెజిల్‌లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న రెండో నగరంగా నమోదైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా గేమ్స్ కోసం వచ్చే ఐదు లక్షల మంది విదేశీ పర్యాటకుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.

పర్యాటకులు ఇక్కడి నుంచి తిరిగి స్వదేశాలకు వెళ్లిన తర్వాత కూడా ఆయా దేశాల్లో జికా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. ఇదే జరిగితే ప్రస్తుతం వైరస్ వ్యాప్తి అంతగా లేని దక్షిణాసియా, ఆఫ్రికా దేశాలు పెద్ద మొత్తంలో నష్టపోయే అవకాశముందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement