భారత జట్టు అంబాసిడర్‌గా మిథాలీ రాజ్‌

Mithali Raj is an Indian team ambassador - Sakshi

 వీధి బాలల క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ టోర్నమెంట్‌ 

న్యూఢిల్లీ: స్ట్రీట్‌ చిల్డ్రన్‌ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ (ఎస్‌సీసీడబ్ల్యూసీ)లో పాల్గొనే భారత జట్టుకు గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ వ్యవహరించనుంది. ఆమెతో పాటు సౌరవ్‌ గంగూలీ, ఐపీఎల్‌ ఫ్రాంచైజీ రాజస్తాన్‌ రాయల్స్‌ కూడా ఈ టోర్నీలో పాల్గొనే జాతీయ జట్టుకు అంబాసిడర్లుగా ఉన్నారు. మే నెలలో వన్డే ప్రపంచ కప్‌ జరుగనున్న నేపథ్యంలో లార్డ్స్‌ మైదానంలోనే ఎస్‌సీసీడబ్ల్యూసీ ఫైనల్‌ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు.
 

ఈ సందర్భంగా మిథాలీ రాజ్‌ మాట్లాడుతూ... వీధి బాలల క్రికెట్‌ వరల్డ్‌ కప్‌లో భాగస్వా మ్యం కావడం సంతోషంగా ఉందని చెప్పింది. ‘ఒక అథ్లెట్‌గా వీధి బాలల జీవితాల్ని క్రీడలు ఎంతగా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోగలను. క్రీడలే వారికి అన్ని వర్గాల మద్దతు లభించేలా దోహదం చేస్తాయి. వీధి బాలల్లోనే దేశానికి అవసరమైన క్రీడా ప్రతిభ ఉంటుంది’ అని పేర్కొంది. లింగ భేదం లేకుండా బాలబాలికలు కలిసి ఈ టోర్నీలో మ్యాచ్‌ లు ఆడనుండటం ఒకింత ఆశ్చర్యానికి, ఆనందానికి లోను చేసిందని మిథాలీ హర్షం వ్యక్తం చేసింది.    

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top