మీడియాతో ఆఫ్రిది జగడం | Miffed Afridi slams reporter over 'captaincy' failure question | Sakshi
Sakshi News home page

మీడియాతో ఆఫ్రిది జగడం

Jan 7 2016 1:50 AM | Updated on Mar 28 2019 6:18 PM

మీడియాతో ఆఫ్రిది జగడం - Sakshi

మీడియాతో ఆఫ్రిది జగడం

సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే పాకిస్తాన్ టి20 కెప్టెన్ ఆఫ్రిది స్వదేశంలో మీడియాతో గొడవ పెట్టుకున్నాడు.

 సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే పాకిస్తాన్ టి20 కెప్టెన్ ఆఫ్రిది స్వదేశంలో మీడియాతో గొడవ పెట్టుకున్నాడు. బుధవారం లాహోర్‌లో జరిగిన మీడియా సమావేశం నుంచి మధ్యలో వైదొలిగాడు. ‘గత కెప్టెన్లతో పోలిస్తే మీ రికార్డు పేలవంగా ఉంది. టి20 ప్రపంచకప్ కోసం మీ దృక్పథాన్ని మార్చుకుంటారా?’ అని రిపోర్టర్ అడగ్గా... ‘నువ్వు ఇలాంటిది అడుగుతావని నాకు తెలుసు’ అంటూ అతడిని దూషిస్తూ అర్ధంతరంగా వెళ్లిపోయాడు. దీంతో మీడియా ప్రతినిధులు ఆఫ్రిదికి వ్యతిరేకంగా డ్రెస్సింగ్ రూమ్ బయట నిరసనకు దిగారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement