breaking news
Pakistan T20 captain
-
పాకిస్తాన్ కెప్టెన్‌గా డేంజరస్ ప్లేయర్.. ఎవరంటే?
పాకిస్తాన్ టీ20 కెప్టెన్ సల్మాన్ అలీ అఘాపై వేటు వేసేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు సిద్దమైనట్లు తెలుస్తోంది. అతడి స్దానంలో విధ్వంసకర ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్‌ను ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా నియమించాలని పీసీబీ యోచిస్తున్నట్లు సమాచారం.వచ్చే నెలలో శ్రీలంకతో సొంతగడ్డపై జరగనున్న టీ20 సిరీస్‌కు ముందే ఫర్హాన్ నియామకంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. కాగా ఆసియా క్రీడల్లోనూ పాకిస్తాన్ జట్టును నడిపించేందుకు ఫర్హాన్ ఇప్పటికే సిద్ధమయ్యాడు. కాగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2028 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే కెప్టెన్సీ మార్పుతో పాటు తమ టీ20 జట్టులో కూడా యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలని పీసీబీ భావిస్తుందంట.కాగా సల్మాన్ అఘా నాయకత్వంలో పాకిస్తాన్ 52 టీ20 మ్యాచ్‌లలో 32 విజయాలు సాధించినప్పటికీ.. అతడి బ్యాటింగ్ ప్రదర్శన మాత్రం దారుణంగా పడిపోయింది. గతేడాది ఆసియాకప్‌తో పాటు టీ20 ప్రపంచకప్-2026లోనూ ఘోరంగా విఫలమయ్యాడు.ఈ క్రమంలోనే అతడిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి, కేవలం బ్యాటర్‌గా మాత్రమే కొనసాగించాలని పీసీబీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరోవైపు ఫర్హాన్ ప్రస్తుతం పాక్ టీ20 జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతుండటంతో పాటు, డొమెస్టిక్ క్రికెట్లో కెప్టెన్‌గా మంచి అనుభవం కలిగి ఉన్నాడు. దీంతో జాతీయ జట్టు పగ్గాలు అతడికి అప్పగించడం సరైన నిర్ణయమని పీసీబీ పెద్దలు భావిస్తున్నరంట.చదవండి: IND vs AUS: అర్ధ శతకంతో మెరిసిన కెప్టెన్.. భారీ ఆధిక్యంలో భారత్ -
మీడియాతో ఆఫ్రిది జగడం
సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే పాకిస్తాన్ టి20 కెప్టెన్ ఆఫ్రిది స్వదేశంలో మీడియాతో గొడవ పెట్టుకున్నాడు. బుధవారం లాహోర్‌లో జరిగిన మీడియా సమావేశం నుంచి మధ్యలో వైదొలిగాడు. ‘గత కెప్టెన్లతో పోలిస్తే మీ రికార్డు పేలవంగా ఉంది. టి20 ప్రపంచకప్ కోసం మీ దృక్పథాన్ని మార్చుకుంటారా?’ అని రిపోర్టర్ అడగ్గా... ‘నువ్వు ఇలాంటిది అడుగుతావని నాకు తెలుసు’ అంటూ అతడిని దూషిస్తూ అర్ధంతరంగా వెళ్లిపోయాడు. దీంతో మీడియా ప్రతినిధులు ఆఫ్రిదికి వ్యతిరేకంగా డ్రెస్సింగ్ రూమ్ బయట నిరసనకు దిగారు.


