నోరు పారేసుకున్న క్రికెటర్ | Miffed Afridi leaves press conference after spat with reporter | Sakshi
Sakshi News home page

నోరు పారేసుకున్న క్రికెటర్

Jan 6 2016 8:18 PM | Updated on Mar 23 2019 8:28 PM

నోరు పారేసుకున్న క్రికెటర్ - Sakshi

నోరు పారేసుకున్న క్రికెటర్

వివాదాలకు చిరునామాగా ఉండే పాకిస్థానీ ఆల్ రౌండర్, టీ20 జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిది మరోసారి నోటిదురుసుతనాన్ని ప్రదర్శంచాడు.

లాహోర్: వివాదాలకు చిరునామాగా ఉండే పాకిస్థానీ ఆల్ రౌండర్, టీ20 జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిది మరోసారి నోటి దురుసుతనాన్ని ప్రదర్శంచాడు. బుధవారం లాహోర్ లోని గడాఫీ నేషనల్ స్టేడియంలో ప్రాక్టీస్ మ్యాచ్ కు ముందు మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన అఫ్రిది.. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులు చెప్పలేక ఆగ్రహంతో ఊగిపోయాడు. అతణ్ని దూషిస్తూ సమావేశం మధ్యలోనే లేచి వెళ్లిపోయాడు. అక్కడ అసలేం జరిగిందంటే..

మార్చిలో భారత్ లో జరగనున్న టీ20 ప్రపంచకప్ లో పాల్గొనే పాక్ జట్టుకు అఫ్రిదియే సారధి. అయితే టీ20 కెప్టెన్ గా మిగతా అందరికంటే అఫ్రిదీకి చెత్త రికార్డుంది. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. 'మీ ఆట, జట్టు తీరును ఎలా మెరుగుపర్చుకుంటారు?' అని ఓ విలేకరి ప్రశ్నించాడు. దీనికి బదులుగా 'నువ్వింత ఏడుపుగొట్టు, చచ్చు ప్రశ్న అగుడుతావని నాకు ముందే తెలుసు' అనేసి కోపంగా వెళ్లిపోయాడు అఫ్రిది. క్రికెటర్ చర్యతో విస్తుపోయిన విలేకరులు.. క్షమాపణ చెప్పాల్సిందిగా డ్రస్సింగ్ రూమ్ ఎదుట ఆందోళన నిర్వహించారు. అయితే పీసీబీ చైర్మన్ షహర్యాన్ ఖాన్ దీనినొక చిన్న సంఘటనగా కొట్టిపారేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement