మోస్ట్‌ పాపులర్‌ నేనేనేమో: రషీద్‌ ఖాన్‌

May Be I Am The Second Most Popular Person In Afghanistan Says Rashid Khan - Sakshi

ముంబై: ఒకరి విజయం వందలమందికి స్ఫూర్తినిస్తుంది. నిత్యం బాంబుల మోతమోగే అఫ్ఘాన్‌ నేలపై క్రికెట్‌ ఓనమాలు దిద్దిన రషీద్‌ ఖాన్‌.. ప్రపంచ స్థాయి ఆటగాడిగా ఎదిగిన తీరు, స్వదేశంలో శాంతి నెలకొనాలని తపిస్తున్న వైనం అభిమానుల మనసుల్లో అతని స్థానాన్ని మరింతగా పదిలం చేశాయి. గత సీజన్‌ కంటే ఐపీఎల్‌ 2018లో అత్యుత్తమ గణాంకాలను నమోదుచేసి, అటు అంతర్జాతీయంగానూ రాణించిన రషీద్‌కు సియాట్‌ ‘‘బౌలర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’’  అవార్డు కూడా దక్కింది. సోమవారం రాత్రి ముంబైలో జరిగిన వేడుకలో అవార్డు స్వీకరించిన ఈ యువ స్పిన్నర్‌.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

సీక్రెట్‌ ఆఫ్‌ సక్సెస్‌: ‘‘టీ20 క్రికెట్‌లో ఆటను ఆస్వాదించడమే అతిప్రధానమైన విషయం. ఎంతలా ఎంజాయ్‌ చేస్తే, మన పెర్ఫామెన్స్‌ అంత బాగుంటుంది. ఎప్పుడైతే భయం మొదలవుతుందో, ఇబ్బందులు తప్పవు. స్పిన్‌ను సమర్థవంతంగా ఆడగలిగిన విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌, ఎంఎస్‌ ధోనీ లాంటి ఉద్ధండులకు బౌలింగ్‌ చేసినప్పుడు కూడా నేను స్థిరంగానే ఉన్నా. వాళ్ళ వికెట్లు పడగొట్టడంతో నా ధైర్యం రెట్టింపైంది. వచ్చే నెలలో ఇండియాతో అఫ్ఘాన్‌ ఆడబోయే టెస్ట్‌ మ్యాచ్‌లోనూ ఇదే యాటిట్యూడ్‌తో ఆడతా..

సచిన్‌ ట్వీట్‌ ఓ స్వీట్‌ షాక్‌: కోల్‌కతాతో జరిగిన క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో నా ప్రదర్శనను అందరూ మెచ్చుకున్నారు. మ్యాచ్‌ అనంతరం స్టేడియం నుంచి హోటల్‌కు బస్‌లో వెళ్లేటప్పుడు నా స్నేహితుడొకరు ఓ స్క్రీన్‌ షాట్‌ పంపాడు. చూస్తే.. సచిన్‌ ట్వీట్‌. అది చదివి చిన్నపాటి షాక్‌కు గురయ్యానంటే నమ్మండి! రియాక్ట్‌ కావడానికి రెండు గంటలు పట్టింది. మరి, క్రికెట్‌ దేవుడిలాంటి సచిన్‌.. నన్ను పొగడటమంటే మాటలా!! ఆయన ప్రశంస నన్ను మరింత ఉత్తేజపర్చింది.

మోస్ట్‌ పాపులర్‌..: ‘ఇండియాలో క్రికెటర్ల పాపులారిటీ ఏంటో చూస్తూనే ఉన్నారు.. మరి అఫ్ఘనిస్తాన్‌లో కూడా ఇలాంటి గుర్తింపే ఉంటుందా?’ అన్న ప్రశ్నకు రషీద్‌ ఖాన్‌... ‘‘ఇప్పటివరకు తెలిసిందేమంటే.. మా దేశాధ్యక్షుడి తర్వాత అఫ్ఘాన్‌లో మోస్ట్‌ పాపులర్‌ వ్యక్తిని నేనేనేమో..’’ అని చమత్కరించాడు.

యుద్ధ బాధితుడు‌: యుద్ధ బాధితులైన రషీద్‌ ఖాన్‌ కుటుంబం.. నాటి సంక్షోభ సమయంలో కొన్నాళ్లపాటు పాకిస్తాన్‌లో తలదాచుకున్నారు. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత తిరిగి స్వస్థలం నంగార్హర్‌(అఫ్ఘనిస్తాన్‌)కు వెళ్లిపోయారు. పాక్‌ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిదీని స్ఫూర్తిగా తీసుకోవడమేకాదు.. అతని బౌలింగ్‌ యాక్షన్‌నే రషీద్‌ అనుకరిస్తాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top