యునైటెడ్‌తో మ్యాచ్‌ ఫైనల్‌లాంటిది | match was the final against United | Sakshi
Sakshi News home page

యునైటెడ్‌తో మ్యాచ్‌ ఫైనల్‌లాంటిది

Apr 27 2017 1:03 AM | Updated on Oct 9 2018 5:31 PM

2010 నుంచి మాంచెస్టర్‌ సిటీ తరఫున ఆడుతున్న యాయా టురెకు తమ ప్రధాన ప్రత్యర్థి మాంచెస్టర్‌ యునైటెడ్‌తో ఎన్నో ఉత్కంఠభరిత

యాయా టురె ఇంటర్వూ

2010 నుంచి మాంచెస్టర్‌ సిటీ తరఫున ఆడుతున్న యాయా టురెకు తమ ప్రధాన ప్రత్యర్థి మాంచెస్టర్‌ యునైటెడ్‌తో ఎన్నో ఉత్కంఠభరిత మ్యాచ్‌లను ఆడిన అనుభవముంది. అయితే నేడు ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ మాత్రం ఫైనల్‌ను మించిన పోరుగా అతను భావిస్తున్నాడు. ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఈపీఎల్‌)లో ఈ రెండు జట్లు నాలు గో స్థానం కోసం పోటీపడుతున్నాయి. దీంతో వచ్చే సీజన్‌లో చాంపియన్స్‌ లీగ్‌కు అర్హత సాధించవచ్చు. మరో ఆరు మ్యా చ్‌లు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో సిటీ జట్టు ఇప్పు డు నాలుగో స్థానంలో ఉంది. యునైటెడ్‌ ఒక్క పాయింట్‌ తేడాతో ఐదో స్థానంలో ఉంది. ఈ దశలో విజయం రెండు జట్లకు అత్యంత కీలకంగా మారింది. దీంతో చిరకాల శత్రువుపై విజయంతో మాంచెస్టర్‌ సిటీ తమ స్థానాన్ని పటిష్టం చేసుకుంటుందా? లేదా? అనేది వేచిచూడాలి.

నేటి మ్యాచ్‌లో ఫలితం తారుమారైతే నాలుగో స్థానం నుంచి పడిపోతారు. మీ ప్రధాన ప్రత్యర్థికి ఆ స్థానం అప్పగించాల్సి ఉంటుంది. ఇది మీలో ఒత్తిడి పెంచుతుందా?
మేము అలా జరగనివ్వం. యునైటెడ్‌తో ఎప్పుడు మ్యాచ్‌ ఆడినా మాకు ప్రత్యేకమే. ఈసారి అంతకుమించిగానే భావిస్తున్నాం. నావరకైతే యునైటెడ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌ ఫైనల్‌లాంటిది.

సిటీ ఆటగాళ్లకు మీరిచ్చే సందేశం?
చాంపియన్స్‌ లీగ్‌లో ఆడాల్సిన అవసరం మాకుంది. గత ఆరేళ్ల నుంచి మేం అర్హత సాధిస్తున్నాం. అందుకే గురువారం మ్యాచ్‌ మాకు చాలా కీలకం.

అయితే ఈసారి యునైటెడ్‌తో మ్యాచ్‌ చాలా కష్టమేమో.. ఎందుకంటే గత అక్టోబర్‌ నుంచి వారు ఓటమి లేకుండా ఆడుతున్నారు?
నాకు తెలుసు. వారి ప్రదర్శన అద్భుతంగా సాగుతోంది. జోస్‌ మౌరిన్హోలాంటి అద్భుత మేనేజర్‌ పర్యవేక్షణలో ఉన్న జట్టది. అందుకే ఇది యుద్ధంగా భావిస్తున్నాం. ఎఫ్‌ఏ కప్‌లో పరాజయం తర్వాత మేం తిరిగి విజయాల బాట పట్టాల్సిన అవసరం ఉంది. అలాగే టాప్‌–3లో ఉండాలనుకుంటున్నాం కాబట్టి విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతాం.

ఎఫ్‌ఏ కప్‌లో అర్సెనల్‌ చేతిలో ఓడిన అనంతరం మీ ఆటగాళ్లు ఎలా ఫీలయ్యారు? మానసికంగా మీరు కోలుకున్నట్టేనా?
ఆ మ్యాచ్‌లో రిఫరీ నిర్ణయాలు మాకు వ్యతిరేకంగా వచ్చా యి. అయితే ఈ ఆటలో ఒక్కోసారి అలా జరగడం సహజం. అక్కడితో ఆ విషయం మరిచిపోయి యునైటెడ్‌తో మ్యాచ్‌పై దృష్టి పెట్టడం ముఖ్యం. ఒక్క గెలుపుతో అన్నీ వెనక్కి వెళతాయి. అయితే ఓడితే పరిస్థితి మరింత దిగజారుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement