మేరీకోమ్‌ ‘రికార్డు’ పంచ్‌

Mary Kom in semis, assured of 7th medal at World Championships - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ చరిత్ర సృష్టించారు. మంగళవారం జరిగిన పోటీల్లో 35 ఏళ్ల మేరీ కోమ్ సంచలన ప్రదర్శన చేసిన మేరీకోమ్‌ సెమీ ఫైనల్లో ప్రవేశించారు. 48 కేజీల లైట్‌ ఫ్లైవెయిట్‌ విభాగంలో మేరీకోమ్‌ 5-0 తేడాతో వుయ్‌(చైనా)పై గెలిచి సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకున్నారు. ఫలితంగా కనీసం కాంస్య పతకాన్ని మేరీకోమ్‌ తన ఖాతాలో వేసుకున్నారు.

అదే సమయంలో ప్రపంచ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఏడో పతకాన్ని మేరీకోమ్‌ సాధించారు. ఈ క్రమంలోనే వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బాక్సర్‌గా అరుదైన రికార్డు సృష్టించారు మేరీకోమ్‌.ఓవరాల్‌ ఈ చాంపియన్‌షిప్‌లో మేరీకోమ్‌  5స్వర్ణాలు, ఒక రజత పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. చివరిసారిగా 2010లో 48 కేజీలో కేటగిరీలో ఆమె స్వర్ణాన్ని సాధించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top