మలేసియా ఓపెన్ చాంప్స్ చెన్ లాంగ్, మారిన్ | Malaysia Open champs Chen Long, Marin | Sakshi
Sakshi News home page

మలేసియా ఓపెన్ చాంప్స్ చెన్ లాంగ్, మారిన్

Apr 6 2015 1:05 AM | Updated on Sep 2 2017 11:54 PM

మలేసియా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ప్రపంచ చాంపియన్స్ చెన్ లాంగ్...

కౌలాలంపూర్ : మలేసియా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ప్రపంచ చాంపియన్స్ చెన్ లాంగ్ (చైనా), కరోలినా మారిన్ (స్పెయిన్) వరుసగా పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో చెన్ లాంగ్ 20-22, 21-13, 21-11తో ఐదుసార్లు విశ్వవిజేత లిన్ డాన్ (చైనా)పై నెగ్గగా... కరోలినా మారిన్ 19-21, 21-19, 21-17తో టాప్ సీడ్ జురుయ్ లీ (చైనా)పై విజయం సాధించింది.సెమీఫైనల్లో భారత స్టార్ సైనా నెహ్వాల్‌ను ఓడించిన జురుయ్ లీ ఫైనల్లో మాత్రం మారిన్‌కు గట్టిపోటీనిచ్చినా కీలకదశలో తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement