ఇంగ్లండ్ క్రికెటర్ల వణుకు
హోటల్ గదుల్లో భయం.. భయంగా
లండన్: ‘నేను ఆన్ చేయకుండానే బాత్‌రూమ్ కుళాయిలో నుంచి నీళ్లు వచ్చేశాయి. లైట్లు వేయగానే నీళ్లు ఆగిపోయాయి. లైట్లు ఆపివేయగానే మళ్లీ నీళ్లు వచ్చాయి. గది ఒక్కసారిగా వేడిగా మారిపోయింది. నాకు చాలా భయం వేసింది’ ఇదేదో హారర్ స్టోరీలో పేరా కాదు. ఇంగ్లండ్ పేస్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌కు ఇటీవల తన హోటల్ రూమ్‌లో ఎదురైన అనుభవం. ఇంతకు ముందు శ్రీలంకతో సిరీస్‌లో దీని గురించి చెప్పుకోకుండా మౌనంగా ఉన్న పాపానికి ఇప్పుడు బ్రాడ్‌కు నిద్ర కరువైంది. భారత్‌తో సిరీస్‌లోనూ ఇంగ్లండ్ జట్టుకు ఇప్పుడు అదే హోటల్‌ను కేటాయించారు. 1865లో నిర్మించిన లండన్‌లోని ప్రతిష్టాత్మక (చారిత్రక) హోటల్ ‘లాంగమ్’లో టీమ్ అంతా ఉంటోంది. అయితే తమను దెయ్యాలు వెంటాడుతున్నాయని, వెంటనే గదులను మార్చమంటూ ఆటగాళ్లు మేనేజ్‌మెంట్ ముందు పోరు పెడుతున్నారు. ‘నా గర్ల్‌ఫ్రెండ్ చాలా భయపడుతోంది. మొయిన్ అలీ భార్య పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక బెన్ స్టోక్స్‌కీ నిద్ర పట్టడం లేదు. లంకతో టెస్టు సమయంలోనైతే రాత్రి 1.30 గంటలకు నా గదిలో ఎవరో తిరుగుతున్నట్లు అనిపించింది’ అని బ్రాడ్ ఆవేదనగా చెప్పాడు. ముఖ్యంగా హోటల్ మూడో అంతస్థులో... గది నంబర్ 333లో భూతాలు తిరుగుతున్నాయని ఆటగాళ్లు భావిస్తున్నారు.
భయంతో బ్రాడ్, ప్రయర్ ఉన్న గదిని పంచుకునేందుకు సిద్ధం కాగా, స్టోక్స్ మూడో ఫ్లోర్ నుంచే మారాడు. ఈ హోటల్‌లో కనీసం ‘ఏడు’ దెయ్యాలు ఉన్నాయని ప్రచారం ఉంది! దీనిపై స్పందించడానికి హోటల్ వర్గాలు నిరాకరిస్తున్నా... ఇలాంటి నిద్ర లేని రాత్రులు తమ ఆటపై ప్రభావం చూపిస్తున్నాయని ఇంగ్లండ్ ఆటగాళ్లు చెబుతున్నారు. అన్నట్లు... 2005లో డర్హమ్‌లోని హోటల్‌లో కూడా ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైతే, భయంతో బయటికి వచ్చిన అతను బ్రెట్‌లీ రూమ్‌ను పంచుకున్నాడు!
‘దెయ్యాలు’ వెంటాడుతున్నాయి!
Published Mon, Jul 21 2014 1:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా... జెట్ స్పీడ్‌లో
Advertisement