
మలేసియా బ్యాడ్మింటన్ దిగ్గజం లీ చోంగ్ వీ ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా క్రీడల నుంచి వైదొలిగాడు. 35 ఏళ్ల లీ చోంగ్ వీ శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో అతను కనీసం నెలరోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
ఫలితంగా లీ చోంగ్ వీ ఈనెల 30 నుంచి చైనాలో జరిగే ప్రపంచ చాంపియన్ షిప్ పోటీల నుంచి... వచ్చే నెలలో ఇండోనేసియాలో జరిగే ఆసియా క్రీడల నుంచి తప్పుకున్నాడు. ఈ ఏడాది తొమ్మిది టోర్నీలు ఆడిన లీ చోంగ్ వీ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గడంతోపాటు మలేసియా ఓపెన్‌లో విజేతగా నిలిచాడు.