క్రికెటర్‌గా మారిన పేస్
నాలుగు పదుల వయస్సులోనూ టెన్నిస్ కోర్టులో అద్భుతాలు సృష్టిస్తున్న దిగ్గజ ఆటగాడు లియాండర్ పేస్ మంగళవారం మరో కొత్త అవతారం ఎత్తాడు. రాకెట్ మాత్రమే కాదు క్రికెట్ బ్యాట్‌తోనూ సత్తా చూపగలనని నిరూపించాడు.
ముంబై: నాలుగు పదుల వయస్సులోనూ టెన్నిస్ కోర్టులో అద్భుతాలు సృష్టిస్తున్న దిగ్గజ ఆటగాడు లియాండర్ పేస్ మంగళవారం మరో కొత్త అవతారం ఎత్తాడు. రాకెట్ మాత్రమే కాదు క్రికెట్ బ్యాట్‌తోనూ సత్తా చూపగలనని నిరూపించాడు.
వడాలాలోని భక్తి పార్క్‌లో ముంబై స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ తరఫున బరిలోకి దిగిన పేస్ ముందుగా బంతితో మెరిశాడు. ఐల్యాండ్- ది స్పోర్ట్స్ గురుకుల్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో స్లో మీడియం పేస్‌తో నాలుగు ఓవర్లు వేసిన ఈ టెన్నిస్ దిగ్గజం 36 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగి 27 బంతుల్లో 42 పరుగులు చేశాడు. దీంట్లో నాలుగు ఫోర్లు, ఓ సిక్స్ కూడా ఉన్నాయి.
అయితే 149 పరుగుల లక్ష్యానికి పేస్ జట్టు 5 పరుగుల దూరంలో నిలిచి ఓడింది. మూడేళ్ల అనంతరం ఆడిన తొలి క్రికెట్ మ్యాచ్ ఇదని, ఇంకో రెండు ఫోర్లు బాదితే తమ జట్టు గెలిచేదని పేస్ అన్నాడు. పాఠశాల స్థాయిలో పేస్‌కు క్రికెట్ ఆడిన అనుభవముంది.


