లేట్‌ ట్వీట్‌.. సచిన్‌నూ వదల్లేదు! | Late Tweet Sachin trolled on Twitter | Sakshi
Sakshi News home page

సచిన్‌ లేట్‌ ట్వీట్‌.. ట్రోల్‌ చేసేశారు

Oct 31 2017 9:51 AM | Updated on Oct 22 2018 6:05 PM

Late Tweet Sachin trolled on Twitter - Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌ : సెలబ్రిటీలు ఎవరైనా సరే వారు చేసే తప్పిదాలకు సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ మాత్రం తప్పటం లేదు. ఆ జాబితాలో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ కూడా ఇప్పుడు చేరిపోయారు. అందుకు కారణం సోమవారం ఆయన చేసిన ఓ ట్వీట్‌.

హోరాహోరీగా సాగిన కాన్పూర్‌ వన్డేలో భారత్‌ ఆరు పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు మంచి ఊపు ఇచ్చింది. భారత్‌ సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే మ్యాచ్‌ జరిగింది ఆదివారం అయితే సచిన్‌ టెండూల్కర్‌ మాత్రం ఆలస్యంగా సోమవారం ట్వీట్‌ చేశారు.

ఇంకేముంది క్రికెట్‌ దేవుడు అని చూడకుండా కొందరు ట్రోల్‌ చేసి పడేశారు. నువ్వా-నేనా అన్నట్టు సాగే ఈ మ్యాచ్‌లో భారత్‌దే విజయమని సచిన్‌ చేసిన ట్వీట్ పై కౌంటర్లు ఎలా ఉన్నాయంటే... 
- సచిన్ అంత సరిగ్గా ఎలా ఊహించారు
- సర్ మీరు చూస్తున్నది రిపీట్ టెలికాస్టా?
- సచిన్ నువ్వు దేవుడివి. వచ్చే ఏడాది జరిగే సిరీస్‌ను కూడా నీవు చూడగలవు
- సర్‌ ముందు మీ సెటప్‌ బాక్స్‌ మార్చుకోండి

ఇలా కొందరు వ్యంగ్యంగా ట్వీట్లు చేసేశారు.

Advertisement
 
Advertisement
Advertisement