రాజస్థాన్ క్రికెట్ సంఘం అధ్యక్ష పదవి నుంచి లలిత్ మోడీని తొలగించారు.
జైపూర్: ఐపీఎల్ చైర్మన్గా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన లలిత్ మోడీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. రాజస్థాన్ క్రికెట్ సంఘం అధ్యక్ష పదవి నుంచి లలిత్ మోడీని తొలగించారు. సోమవారం జరిగిన ప్రత్యేక కార్యవర్గ సమావేశంలో మోడీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. రాజస్థాన్ క్రికెట్ సంఘంలో మొత్తం 18 మంది సభ్యులుండగా, 17 మంది మోడీకి వ్యతిరేకంగా ఓటేశారు. రాజస్థాన్ క్రికెట్ సంఘం కొత్త చీఫ్గా ఆమిన్ పఠాన్ పేరు ఖరారైంది.
ఐపీఎల్లో అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలపై గతంలో మోడీని చైర్మన్ పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత బీసీసీఐ, ఐపీఎల్కు దూరమయ్యారు. బోర్డు హెచ్చరికలను భేఖాతరు చేస్తూ మోడీ రాజస్థాన్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయనను పదవి నుంచి తొలగించారు.