అగ్రస్థానంలో కేఎస్‌ఆర్‌ఎం రాజు | KSRM Raju top place in Bishan singh memorial chess tournament | Sakshi
Sakshi News home page

అగ్రస్థానంలో కేఎస్‌ఆర్‌ఎం రాజు

Dec 24 2017 10:24 AM | Updated on Sep 4 2018 5:32 PM

 KSRM Raju top place in Bishan singh memorial chess tournament - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సర్దార్‌ బిషన్‌ సింగ్‌ స్మారక ఓపెన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో వెటరన్‌ ప్లేయర్‌ కేఎస్‌ఆర్‌ఎం రాజు, సీనియర్‌ చెస్‌ కోచ్‌ జె. మల్లేశ్వర్‌ రావు సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. ముషీరాబాద్‌ క్రాస్‌ రోడ్స్‌లోని ఆమంత్రణ్‌ హోటల్‌లో జరుగుతోన్న ఈ పోటీల్లో 5 రౌండ్లు ముగిసేసరికి వీరిద్దరూ 5 పాయింట్లను సాధించారు. శనివారం జరిగిన ఐదో రౌండ్‌ గేమ్‌లో ఫణి కనూరి (4)పై రాజు (5), ప్రణీత్‌ ఉప్పాల (4)పై మల్లేశ్వర రావు గెలుపొందారు.

ఇతర మ్యాచ్‌ల్లో షణ్ముఖ తేజ (3.5)పై రాజా రిత్విక్‌ (4.5), అమిత్‌పాల్‌ సింగ్‌ (3.5)పై సాయి వర్షిత్‌ (4.5), విశ్వనాథ్‌ ప్రసాద్‌ (3.5)పై రామానుజాచార్యులు (4.5) విజయం సాధించారు. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ టోర్నీలో 180 మంది చెస్‌ క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో 88 మంది అంతర్జాతీయ ఫిడే రేటెడ్‌ క్రీడాకారులు ఉన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement