ఫామ్‌లోకి వచ్చిన కోహ్లి

Kohli, Vijay steady India - Sakshi

సెంచూరియన్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఘోరంగా విఫలమైన భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. రెండో టెస్టులో ఫామ్‌లోకి వచ్చాడు. ఆదివారం ఆటలో భాగంగా భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి హాఫ్‌ సెంచరీ సాధించాడు. టీమిండియా 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ తరుణంలో కోహ్లి బాధ్యతాయుతంగా ఆడాడు. ఓపెనర్‌ మురళీ విజయ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టాడు. ఈ క‍్రమంలో 67 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. మరొకవైపు విజయ్‌ కూడా రాణించడంతో భారత జట్టు 36 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.

ఈ రోజు తొలి ఇన్నింగ్స్‌ చేపట్టిన టీమిండియా వరుస బంతుల్లో కేఎల్‌ రాహుల్‌(10), చతేశ్వర పుజారా(0) వికెట్లను కోల్పోయింది. మోర్కెల్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్‌ మూడో బంతికి రాహుల్‌ అవుట్‌ కాగా, ఆపై వెంటనే పుజారా డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. అంతకుముందు సఫారీలు తమ తొలి ఇన్నింగ్స్‌లో 335 పరుగులకు ఆలౌటయ్యారు. 269/6 ఓవర్‌ నైట్‌ స్కోరుతో ఇన్నింగ్స్‌ ఆరంభించిన దక్షిణాఫ్రికా.. మరో 66 పరుగులు జత చేసి మిగతా నాలుగు వికెట్లను కోల్పోయింది. అశ్విన్‌ నాలుగు వికెట్లు, ఇషాంత్‌ శర్మ మూడు వికెట్లు సాధించగా, షమీకి వికెట్‌ దక్కింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top