నితీష్‌ రాణాపై కోహ్లి ఫ్యాన్స్‌ ఫైర్‌.! | Kohli Fans Fire on Nitish Rana | Sakshi
Sakshi News home page

Apr 9 2018 6:43 PM | Updated on Apr 9 2018 6:43 PM

Kohli Fans Fire on Nitish Rana - Sakshi

కోహ్లిని దూషిస్తున్న రాణా

కోల్‌కతా : కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్యాట్స్‌మన్‌ నితీష్‌ రాణాపై రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్ కోహ్లి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్‌-11 సీజన్‌లో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పార్ట్‌టైం బౌలర్‌ అవతారమెత్తిన నితీష్‌ రాణా అనుహ్యంగా వరుస బంతుల్లో విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌, కోహ్లిలను పెవిలియన్‌కు చేర్చిన విషయం తెలిసిందే. 

అయితే కోహ్లి క్లీన్‌ బౌల్డ్‌ చేసిన రాణా అరుస్తూ అతన్ని అసభ్యంగా దూషించాడు. ఇది టీవీ రిప్లేలో స్పష్టం కావడం, దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్‌ నెట్టింట్లో వైరల్‌ కావడం కోహ్లి అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. దీంతో సోషల్ మీడియా వేదికగా రాణాను టార్గెట్‌ చేస్తూ పోస్టులతో మండిపడుతున్నారు. ఒక్కసారి అవుట్‌ చేసినందుకు అంతలా ఎగిరిపడాలా..అని ఒకరంటే.. అసభ్యంగా దూషించడం ఏంటని.. ఇంకోకరు.. జాగ్రత్తా కోహ్లి భారత కెప్టెన్‌..అతనికి నీవుచ్చే గౌరవం ఇదేనా అని కామెంట్‌ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై కోల్‌కతా 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement