పాండ్యాకు రాహుల్‌ సవాల్‌!

KL Rahul Accepts Virat Kohlis Fitness Challenge - Sakshi

ఫిట్‌నెస్‌ చాలెంజ్‌కు విశేష స్పందన

న్యూఢిల్లీ : కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్థన్‌సింగ్‌ రాథోడ్‌ పిలుపునిచ్చిన ‘ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌’కు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. క్రీడాకారుల నుంచే కాకుండా సినీతారాలు, సామన్య ప్రజానికం సైతం ఈ చాలెంజ్‌కు సై అంటున్నారు. ‘‘హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌’ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో మొదలుపెట్టిన రాథోడ్‌  ఈ ఛాలెంజ్‌ను కోహ్లీ, హృతిక్‌రోషన్‌, సైనా నెహ్వాల్‌కు విసిరాడు.

మంత్రి చాలెంజ్‌ను స్వీకరించిన టీమిండియా కెప్టెన్‌ కోహ్లి.. ప్రధాని నరేంద్రమోదీ, టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని, అనుష్కశర్మతో పాటు కేఎల్‌ రాహుల్‌లకు సవాల్‌ విసిరాడు. అయితే కోహ్లి సవాల్‌ను స్వీకరించిన కేఎల్‌ రాహుల్‌ తన ఫిట్‌నెస్‌ కసరత్తుల సంబంధించిన వీడియోను షేర్‌ చేస్తూ.. హార్ధిక్‌పాండ్యా, దినేశ్‌కార్తీక్‌లకు చాలెంజ్‌ విసిరాడు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ సైతం సవాల్‌ స్వీకరిస్తున్నట్లు చెప్పి త్వరలోనే వీడియోను ఫోస్ట్‌ చేస్తానని తెలిపిన విషయం తెలిసిందే. ఇక సురేశ్‌ రైనా హర్భజన్‌​ను చాలెంజ్‌ చేయగా.. బ్యాడ్మింటన్‌ స్టార్‌ కిదాంబి శ్రీకాంత్‌ టాలీవుడ్‌ హీరో రానాదగ్గబాటి, రకుల్‌ప్రీత్‌ సింగ్‌లకు సవాల్‌ విసిరాడు. ప్రస్తుతం ఈ చాలెంజ్‌ నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top