ఐపీఎల్‌: జి‘గేల్‌’రాజా లేడు | Kings Punjab Rested Gayle | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌: జి‘గేల్‌’రాజా లేడు

Apr 23 2018 7:56 PM | Updated on Apr 23 2018 8:10 PM

Kings Punjab Rested Gayle - Sakshi

ఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఇక్కడ ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ గౌతం గంభీర్‌.. తొలుత కింగ్స్‌ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటివరకూ కింగ్స్‌ పంజాబ్‌ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట​ విజయం సాధించగా, ఢిల్లీ ఐదు మ్యాచ్‌లకు గాను ఒక దాంట్లో మాత్రమే గెలిచింది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.

కాగా, కింగ్స్‌ పంజాబ్‌ హ్యాట్రిక్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించిన క్రిస్‌ గేల్‌.. ఢిల్లీతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతనికి కింగ్స్‌ పంజాబ్‌ విశ్రాంతి ఇచ్చింది. ఈ క్రమంలోనే గేల్‌ స్థానంలో డేవిడ్‌ మిల్లర్‌ తుది జట్టులో చేరాడు. మరొకవైపు జాసన్‌ రాయ్‌, క్రిస్‌ మోరిస్‌, నదీమ్‌, విజయ్‌ శంకర్‌, హర్షల్‌ పటేల్‌లకు విశ్రాంతినిచ్చారు.  వారి స్థానాల్లో అవిష్‌ ఖాన్‌, పృథ్వీషా, డానియల్‌ క్రిస్టియన్‌, ప‍్లంకెట్‌, అమిత్‌ మిశ్రాలు తుది జట్టులోకి వచ్చారు.

తుది జట్లు

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌

గౌతం గంభీర్‌(కెప్టెన్‌) శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌,  రాహుల్‌ తెవాతియా, ప్లంకెట్‌,  అమిత్‌ మిశ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌, అవిష్‌ ఖాన్‌, పృథ్వీషా, డానియల్‌ క్రిస్టియన్‌

కింగ్స్‌ పంజాబ్‌

అశ్విన్‌(కెప్టెన్‌), అరోన్‌ ఫించ్‌, కేఎల్‌ రాహుల్‌, మయాంక అగర్వాల్‌, కరుణ్‌ నాయర్‌, యువరాజ్‌ సింగ్‌, డేవిడ్‌ మిల్లర్‌, ఆండ్రూ టై, బరీందర్‌ శ్రాన్‌, అన్‌కిత్‌ రాజ్‌పుత్‌, ముజిబ్‌ ఉర్‌ రెహ్మాన్‌

Advertisement
 
Advertisement
Advertisement