పీఎస్ఎల్ కు పీటర్సన్.. | Kevin Pietersen Gives Pakistan Super League a Celebrity Boost | Sakshi
Sakshi News home page

పీఎస్ఎల్ కు పీటర్సన్..

Sep 21 2015 5:57 PM | Updated on Sep 3 2017 9:44 AM

పీఎస్ఎల్ కు పీటర్సన్..

పీఎస్ఎల్ కు పీటర్సన్..

త్వరలో యూఏఈలో జరిగే పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) లో తాను కూడా పాల్గొంటానని ఇంగ్లండ్ డాషింగ్ ఆటగాడు కెవిన్ పీటర్సన్ స్పష్టం చేశాడు.

లాహోర్:త్వరలో యూఏఈలో జరిగే పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) లో తాను కూడా పాల్గొంటానని ఇంగ్లండ్ డాషింగ్ ఆటగాడు కెవిన్ పీటర్సన్ స్పష్టం చేశాడు. తాను లీగ్ లు ఆడటం కొత్తమే కాదని.. ఇప్పటికే భారత్ లో జరిగే ఐపీఎల్లో అనేక మ్యాచ్ లు ఆడిని సంగతిని తెలిపాడు.  దీనిలో భాగంగా సోమవారం నిర్వహించిన పీఎస్ఎల్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఓ వీడియో సందేశాన్ని పీటర్సన్ పంపాడు.  తాను పీఎస్ఎల్ కు కచ్చితంగా అందుబాటులో ఉంటానని పీటర్సన్ తెలియజేశాడు. ఈ పోటీల్లో పాల్గొనటానికి తాను ఎంతో ఆతృతగా ఉన్నానన్నాడు. అతి త్వరలో ఆరంభం కానున్న పాకిస్థాన్ ఈవెంట్ లో సందడి చేస్తానన్నాడు. ఇప్పటికే ఐపీఎల్ తరువాత కరేబియన్ లీగ్ లో ఆడిన పీటరసన్.. నవంబర్ లో సౌతాఫ్రికాలో జరిగే రామ్ స్లామ్ ట్వంటీ 20 మ్యాచ్ ల్లో ఆడనున్నాడు.

 

ఇదిలా ఉండగా, ఐపీఎల్ తరహాలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రారంభించనున్న పాకిస్థాన్ టీ20 సూపర్ లీగ్ పోటీలకు ఆదరణ ఉంటుందా? లేదా? అనేది సందేహమే. క్రికెట్ను వెర్రిగా ప్రేమించే దక్షిణాసియా దేశాల్లో భారత్ తర్వాత ఎక్కువ మంది అభిమానులున్నది పాకిస్థాన్లోనే.  వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న దోహా (ఖతార్) వేదికగా  పీఎస్ఎల్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. దాదాపు 20 రోజులపాటు జరిగే మొదటి సీజన్ లో మొత్తం ఐదు జట్లు బరిలోకి దిగనున్నాయి. టోర్నీ మొత్తం మీద 24 మ్యాచ్ లు జరుగుతాయి. ఇక ఈ టోర్నీకి ప్రచారకర్తలు (బ్రాండ్ అంబాసిడర్లు)గా మాజీ క్రికెటర్లు వసీం అక్రం, రమీజ్ రాజాలు నియమితులయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement