మళ్లీ ఓడిన హైదరాబాద్‌ | Kerala Blasters Beat Hyderabad | Sakshi
Sakshi News home page

మళ్లీ ఓడిన హైదరాబాద్‌

Jan 6 2020 3:39 AM | Updated on Jan 6 2020 3:39 AM

Kerala Blasters Beat Hyderabad - Sakshi

కొచ్చి: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. కేరళ బ్లాస్టర్స్‌తో ఆదివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 1–5 గోల్స్‌ తేడాతో ఓడిపోయింది. మరోవైపు కేరళ బ్లాస్టర్స్‌కు పది మ్యాచ్‌ల అనంతరం మరో విజయం లభించింది. తాజా ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఆరంభ మ్యాచ్‌లో తొలి విజయం సాధించిన కేరళ... తిరిగి 11వ మ్యాచ్‌లో కానీ రెండో గెలుపు రుచిని చూడలేదు. ఈ విజయంతో ఈ సీజన్‌ ఆరంభంలో హైదరాబాద్‌ చేతిలో ఎదురైన ఓటమికి కేరళ బదులు తీర్చుకుంది. కేరళ  ఆటగాళ్లు ఒగ్బెచె (33వ, 74వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చేయగా... ద్రొబరోవ్‌ (39వ నిమిషంలో), మెస్సీ బౌలి (45వ నిమిషంలో), సెత్యసేన్‌ (59వ నిమింలో) తలా ఒక గోల్‌ వేశారు. హైదరాబాద్‌ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను బొబొ (14వ నిమిషంలో) సాధించాడు. నేటి మ్యాచ్‌లో ఒడిశా ఎఫ్‌సీతో చెన్నైయిన్‌ ఎఫ్‌సీ తలపడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement