
దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ ఈ తరం క్రికెటర్ అయి ఉంటే... ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు అతడిని చేజిక్కించుకునేందుకు యుద్ధమే చేసేవని, అందరికంటే అత్యధికంగా రూ.25 కోట్లు పలికేవాడని భారత మేటి బ్యాట్స్‌మన్ సునీల్ గావస్కర్ అన్నాడు. తద్వారా మాజీ సహచరుడి గొప్పదనం ఏపాటిదో ఒక్క మాటలో చెప్పేశాడు.
ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో కపిల్‌తో కలిసి పాల్గొన్న గావస్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. దీనికి బిగ్గరగా నవ్విన కపిల్... తానెంతగానో అభిమానించే క్రికెట్‌లో ఇంత పెద్దమొత్తంలో డబ్బు వస్తోందంటే నమ్మలేకపోతున్నానన్నాడు.