తన రికార్డు తానే బద్ధలు | Kamalpreet Singh breaks own hammer throw national record | Sakshi
Sakshi News home page

తన రికార్డు తానే బద్ధలు

May 22 2015 3:49 PM | Updated on Sep 3 2017 2:30 AM

తన రికార్డు తానే బద్ధలు

తన రికార్డు తానే బద్ధలు

తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నాడు ప్రముఖ హ్యామర్ త్రో క్రీడాకారుడు కమల్ ప్రీత్ సింగ్.

న్యూఢిల్లీ: తన రికార్డును తానే బద్ధలు కొట్టుకున్నాడు ప్రముఖ హ్యామర్ త్రో క్రీడాకారుడు కమల్ ప్రీత్ సింగ్. టస్కాన్లోని యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాలో జరిగిన పోటీల్లో పాల్గొన్న ఈ అథ్లెట్ క్రీడాకారుడు 72.86 మీటర్ల దూరం హ్యామర్ను విసిరి రికార్డు సృష్టించాడు. ఈ సీజన్లో ఆసియాలోనే మూడో వ్యక్తి గా రికార్డు నమోదుచేశాడు.

గడిచిన రెండు నెలల్లోనే ఇలా జాతీయ స్థాయి రికార్డును బద్ధలు కొట్టేయడం ఇది రెండో సారి. ఇదిలా ఉండగా, జూన్ 3 నుంచి 7 వరకు చైనాలో జరిగే ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ కోసం కమల్ ఎంపిక కాకపోవడం గమనార్హం. పంజాబ్కు చెందిన  కమల్ ప్రీత్ సింగ్ పేరిట గతంలో 70.38, 70.37 మీటర్ల రికార్డు ఉండగా ఈసారి 72.86 మీటర్లు హ్యామర్ ను విసిరి రికార్డు బద్ధలు కొట్టాడు.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement