విరాట్‌-అనుష్క పెళ్లిపై జోకులే జోకులు! | Jokes on virat anushka sharma wedding | Sakshi
Sakshi News home page

విరాట్‌.. 31లోపు మీ పెళ్లిని ఆధార్‌తో లింక్‌ చేసుకో..!

Dec 13 2017 2:59 PM | Updated on Sep 18 2018 8:48 PM

విరాట్‌ కోహ్లి-అనుష్క శర్మ పెళ్లి.. ఇప్పుడిదే ఇదే సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌.. నెటిజన్లు ఇప్పుడు వీరి పెళ్లి గురించే చర్చించుకుంటున్నారు. అభినందనలతో వీరిని ముంచెత్తుతున్నారు. అనుష్కతో తన పెళ్లి గురించి ప్రకటిస్తూ కోహ్లి చేసిన ట్వీట్‌..అతి తక్కువ సమయంలో అత్యధిక మంది రీట్వీట్‌ చేశారు. దీంతో 2017లో అత్యధికమంది రీట్వీట్‌ చేసి.. ‘గోల్డెన్‌ ట్వీట్‌ ఆఫ్‌ 2017’ ఘనతను ఇది సొంతం చేసుకుంది. అభినందనలే కాదు వీరి పెళ్లిపై జోకులు కూడా సోషల్‌ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. పెళ్లి గురించి వెల్లడిస్తూ అనుష్క, విరాట్‌ ఒకేరకమైన మెసేజ్‌ను ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. ‘నీ మెసెజ్‌ మస్తుంది. కాపీ చేసుకోవాలా?’ అని కోహ్లి అడిగితే.. ‘హా కాపీ చేసుకో.. కానీ ఫొటో మాత్రం మార్చు’ అని అనుష్క చెప్పినట్టు ఓ నెటిజన్‌ చమత్కరించాడు.
 

ప్రధాని మోదీ ట్విట్టర్‌లో విరుష్క జంటకు ‘హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌’ అంటూ అభినందనలు  తెలిపాడు. దీనికి కోహ్లి కృతజ్ఞతలు తెలుపగా..  ‘ఇంకో మాట.. నీ పెళ్లి సర్టిఫికెట్‌ను ఆధార్‌తో డిసెంబర్‌ 31లోపు తప్పకుండా లింక్‌చేయి’ అని ప్రధాని మోదీ సూచించాడు. ఇది నిజం కాదు.. ఫొటోషాప్‌ చేసి ఫన్నీగా ఓ నెటిజన్‌ పెట్టిన వ్యంగ్యాస్త్రం.

మొదటిరాత్రి విరాట్‌ ఒత్తిడిలో ఉండి ఉంటాడు. ఎందుకంటే  యూరప్‌లోని అతనికి పెద్దగా రికార్డు లేదు అంటూ ఓ నెటిజన్‌ చమత్కరించారు. భాయ్‌ నెక్ట్స్‌ మ్యాచ్‌ ఆడుతావా? అని రోహిత్‌ అడిగితే.. నేను హనీమూన్‌లో ఉన్న దుకాన్‌ బంద్‌ అంటూ ఓ నెటిజన్‌ జోకును పేల్చాడు. డ్యాండ్రఫ్‌ బనాదీ జోడీ అంటూ మరొకరు ట్వీట్‌ చేశారు. ఇలా పెద్దసంఖ్యలో జోకులు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement