ఒకేసారి 27 రికార్డులు బద్దలు | Jeremy Lalrinnunga Wins Silver At Qatar International Cup | Sakshi
Sakshi News home page

ఒకేసారి 27 రికార్డులు బద్దలు

Dec 22 2019 1:10 AM | Updated on Dec 22 2019 1:10 AM

Jeremy Lalrinnunga Wins Silver At Qatar International Cup - Sakshi

జెరెమీ లాల్‌రినుంగా

దోహా: ఖతర్‌ కప్‌ అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ టోర్నమెంట్‌లో యూత్‌ ఒలింపిక్స్‌ చాంపియన్, భారత యువతార జెరెమీ లాల్‌రినుంగా రజత పతకం సాధించాడు. పురుషుల 67 కేజీల విభాగంలో పోటీపడిన మిజోరం లిఫ్టర్‌ లాల్‌రినుంగా మొత్తం 306 (స్నాచ్‌లో 140 కేజీల+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 166 కేజీలు) కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 17 ఏళ్ల లాల్‌రినుంగా తన పేరిటే ఉన్న ఐదు సీనియర్‌ జాతీయ రికార్డులను, ఐదు జాతీయ జూనియర్‌ రికార్డులను, ఐదు జాతీయ యూత్‌ రికార్డులను, మూడు యూత్‌ వరల్డ్‌ రికార్డులను, మూడు ఆసియా యూత్‌ రికార్డులను, ఆరు కామన్వెల్త్‌ రికార్డులను బద్దలు కొట్టాడు.

Advertisement
 
Advertisement
Advertisement