సెమీస్‌లో జేమ్స్ | james entered in semi finals | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో జేమ్స్

Dec 14 2013 12:34 AM | Updated on Sep 2 2017 1:34 AM

సీనియర్స్ స్నూకర్స్ స్టేట్ ర్యాంకింగ్ పోటీల్లో షూటర్స్ డెన్‌కు చెందిన జేమ్స్ సుందర్‌రాజ్ సెమీఫైనల్‌కు చేరాడు.

రాయదుర్గం, న్యూస్‌లైన్:  సీనియర్స్ స్నూకర్స్ స్టేట్ ర్యాంకింగ్ పోటీల్లో షూటర్స్ డెన్‌కు చెందిన జేమ్స్ సుందర్‌రాజ్ సెమీఫైనల్‌కు చేరాడు. శుక్రవారం సాయంత్రం నిర్వహించిన క్వార్టర్స్ ఫైనల్ పోటీలో జేమ్స్ సుందర్‌రాజ్ 4-0 ఫ్రేమ్స్‌తో అహ్మద్ ముస్తఫాను ఓడించాడు.
 
 అంతకుముందు నిర్వహించిన ప్రిక్వార్టర్ ఫైనల్లో  జేమ్స్ సుందర్‌రాజ్ 3-1తో కైజర్ రవూఫ్‌ను, అహ్మద్ ముస్తఫా 3-1తో జి పాండును, పవన్‌కుమార్ 3-0తో వంశీకృష్ణను, ఐవి రాజు 3-1తో ప్రదీప్‌ను, శంకర్‌రావు 3-1తో హేమంత్‌సింగ్ ఠాకూర్‌ను, బాలకృష్ణ 3-2తో కె.శ్రీనివాస్‌ను, హిమాన్షు జైన్ 3-1తో శివశర్మ, విశాల్ అగర్వాల్ 3-2తో డి అరవిం ద్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement