కోల్‌కతా చేతుల్లోనే... | ipl point table | Sakshi
Sakshi News home page

కోల్‌కతా చేతుల్లోనే...

May 22 2016 1:03 AM | Updated on Sep 4 2017 12:37 AM

ముంబైపై విజయంతో గుజరాత్ జట్టు ప్లే ఆఫ్‌కు చేరడంతో పాటు టాప్-2లో ఒక స్థానాన్ని ఖరారు చేసుకుంది....

ముంబైపై విజయంతో గుజరాత్ జట్టు ప్లే ఆఫ్‌కు చేరడంతో పాటు టాప్-2లో ఒక స్థానాన్ని ఖరారు చేసుకుంది. సన్‌రైజర్స్ కూడా ప్లే ఆఫ్‌కు చేరింది.
నేడు జరిగే తొలి మ్యాచ్‌లో కోల్‌కతా గెలిస్తే... హైదరాబాద్, కోల్‌కతా రెండూ ప్లే ఆఫ్‌కు వెళతాయి. బెంగళూరు, ఢిల్లీ మ్యాచ్‌లో విజేత ముందుకు వస్తుంది.
ఒకవేళ హైదరాబాద్ గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి వస్తుంది. కోల్‌కతా 14 పాయింట్ల దగ్గర ఆగుతుంది. అప్పుడు రెండో మ్యాచ్‌లో ఢిల్లీ గెలిస్తే... ఢిల్లీ, బెంగళూరు (14 పాయింట్లే అయినా మెరుగైన రన్‌రేట్ వల్ల) ముందుకు వెళతాయి. ఒకవేళ బెంగళూరు గెలిస్తే... కోల్‌కతా, ఢిల్లీ, ముంబై 14 పాయింట్లతో ఉంటాయి. అప్పుడు మెరుగైన రన్‌రే ట్ ఉన్న జట్టు (కోల్‌కతాకు ఎక్కువ అవకాశం ఉంది) ముందుకు వస్తుంది.
 

 


      
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement