ఎస్‌ఆర్‌హెచ్‌కు గార్గ్‌.. ఆర్‌ఆర్‌కు జైస్వాల్‌ | IPL Auction 2020: Yashasvi Jaiswal Sold To Rajasthan Royals | Sakshi
Sakshi News home page

ఎస్‌ఆర్‌హెచ్‌కు గార్గ్‌.. ఆర్‌ఆర్‌కు జైస్వాల్‌

Dec 19 2019 5:52 PM | Updated on Dec 19 2019 5:55 PM

 IPL Auction 2020: Yashasvi Jaiswal Sold To Rajasthan Royals - Sakshi

కోల్‌కతా: ఊహించినట్లే భారత యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్‌, ప్రియాం గార్గ్‌లు ఐపీఎల్‌ వేలంలో ఫర్వాలేదనిపించారు. భారత ఆండర్‌-19 క్రికెటర్లైన జైస్వాల్‌ను రాజస్తాన్‌ రాయల్స్‌ కొనుగోలు చేయగా,  గార్గ్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొనుగోలు చేసింది. ఈ వేలంలో తొలుత ప్రియాం గార్గ్‌ను రూ. 1.90 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ దక్కించుకోగా, జైస్వాల్‌ను రూ. 2.40 కోట్లకు రాజస్తాన్‌ రాయల్స్‌ చేజిక్కించుకుంది. 

అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్స్‌ అయిన గార్గ్‌-జైస్వాల్‌ల కనీస ధర రూ. 20  లక్షలు ఉండగా పలు ఫ్రాంఛైజీలు వీరి కోసం పోటీ పడ్డాయి. ప్రధానంగా ముంబై ఇండియన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌, కింగ్స్‌ పంజాబ్‌లు వీరి కోసం ఆసక్తి చూపాయి. ఇక వరుణ్‌ చక్రవర్తిని కేకేఆర్‌ కొనుగోలు చేసింది. వరుణ్‌ చక్రవర‍్తికి రూ. 4 కోట్ల ధర వెచ్చించి కేకేఆర్‌ దక్కించుకుంది. దీపక్‌ హుడా కనీస ధర రూ. 40 లక్షలు ఉండగా అతన్ని రూ. 50  లక్షలకు కింగ్స్‌ పంజాబ్‌ కొనుగోలు  చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement