రసెల్‌ వర్సెస్‌ రబడ

IPl 2019 KKR Host Delhi capitals At Eden Garden - Sakshi

నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌

కోల్‌కతా: ప్రస్తుత ఐపీఎల్‌లో భీకరమైన ఫామ్‌లో ఉండి ప్రత్యర్థి జట్లకు చెమటపట్టిస్తున్న ఆటగాడెవరెంటే నిస్సందేహంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు ఆండ్రూ రసెలే. ఇప్పటివరకూ కేకేఆర్‌ ఆడిన మ్యాచ్‌ల్లో రస్సెల్‌ విజృంభించిన తీరు దీనికి నిదర్శనం. ఆరు మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్‌ 4 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉందంటే అది రస్సెల్‌ చలవే. ఈ ఆరు మ్యాచ్‌ల్లోనూ విధ్వంసక వీరుడు 257 పరుగులు సాధించాడు.

ఇందులో 150 పరుగులు ఏకంగా సిక్సర్ల రూపంలోనే వచ్చాయి. ఇంతగా విజృంభిస్తున్న రసెల్‌ను కట్టడి చేసింది.. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్‌ కాగిసో రబడ మాత్రమే. ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్లా మైదానం వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో.. సూపర్‌ ఓవర్లో రబడ అద్భుతమైన యార్కర్‌తో రస్సెల్‌ను పెవిలియన్‌కు చేర్చి తమ జట్టుకు విజయాన్ని కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు కోల్‌కతా వేదికగా ఈ రెండు జట్లు మరోసారి తలపడనున్నాయి. ఇందులోనూ ఈ ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు సాగడం ఖాయం. 

గంగూలీ ఎటువైపు..?
ఈ రెండు జట్ల మధ్య పోరులో మరో ఆసక్తికర అంశం. టీమిండియా, కేకేఆర్‌ మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీకి కోల్‌కతా సొంత మైదానం. అంతేకాదు క్యాబ్‌ అధ్యక్షుడిగానూ గంగూలీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇంతకుముందు ఇక్కడ కేకేఆర్‌తో ఏ జట్టు తలపడినా గంగూలీ మద్దతు సొంత జట్టుకే. అయితే, ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్‌(డీసీ)కు సలహాదారుగా ఉన్న దాదా ఈసారి ఏ జట్టు డగౌట్‌ వైపు కూర్చుంటాడనేది ఆసక్తికరం. 

జట్లు(అంచనా): 
కోల్‌కతా నైట్‌ రైడర్స్‌: దినేశ్‌ కార్తీక్‌(కెప్టెన్‌), రాబిన్‌ ఉతప్ప, క్రిస్‌ లిన్, శుభ్‌మన్‌ గిల్, రసెల్, సునీల్‌ నరైన్, పీయూష్‌ చావ్లా, కుల్‌దీప్‌ యాదవ్, ప్రసీద్‌ కృష్ణ, ఫెర్గూసన్‌. 

ఢిల్లీ క్యాపిటల్స్‌: శ్రేయస్‌ అయ్యర్‌(కెప్టెన్‌), పృథ్వీ షా, శిఖర్‌ ధవన్, రిషబ్‌ పంత్, కొలిన్‌ ఇంగ్రామ్, అక్షర్‌ పటేల్, రాహుల్‌ తెవాటియా, రబడ, ఇషాంత్, క్రిస్‌ మోరిస్, బౌల్ట్‌. 

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top