‘తరం మారినా.. ఆటతీరు మారలేదు’

IPL 2019 Ganguly Cuts And Drives During Delhi Capitals Practice Session - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ మరోసారి బ్యాట్‌ పట్టి కట్‌, డ్రైవ్‌ షాట్‌లు ఆడుతున్నాడు.  అదేంటీ గంగూలీ ఎప్పుడో రిటైర్మెంట్‌ ప్రకటించాడు కదా.. మళ్లీ బ్యాట్‌పట్టి ఆడటమేంటి అనుకుంటున్నారా?. అయితే ఈ సారి ఆటగాడిగా కాకుండా సలహాదారుగా కొత్త అవతారం ఎత్తాడు గంగూలీ. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌లో)లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు సలహాదారుడిగా వ్యవహరిస్తున్న దాదా.. ఆటగాళ్లకు మెరుగులు దిద్దుతున్నాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 

ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రాక్టీస్‌ సెషన్‌లో భాగంగా ఆటగాళ్లకు సూచనలు ఇస్తూ.. తను కూడా కాసేపు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. కట్‌, డ్రైవ్‌ షాట్‌లు ఆడుతూ అలరించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. దాదా అభిమానులు ఈ వీడియో చూసి తెగ సంబరపడుతున్నారు. ‘తరం మారినా.. గంగూలీ ఆటతీరు మారలేదు’అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ తన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌న్‌ను మట్టికరిపించిన విషయం తెలిసిందే. తన తరువాతి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో శనివారం తలపడనుంది. 

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top