సలాం.. వాట్సన్‌ భాయ్‌

IPL 2019 Final CSK Salute Watson Who Battled Bloodied Leg - Sakshi

చెన్నై: గాయం లెక్క చేయకుండా.. రక్తం కారుతున్నా.. పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడిన షేన్‌ వాట్సన్‌కు చెన్నై సూపర్‌కింగ్స్‌ యాజమాన్యం, అభిమానులు సెల్యూట్‌ చేస్తున్నారు. విజయం ఎవరిని వరించినా గాయంతో వాట్సన్‌ పోరాడిన తీరు అద్భుతం అంటూ కొనియాడుతున్నారు. మంగళవారం సీఎస్‌కే తన అధికారిక ట్వీటర్‌లోనూ వాట్సన్‌పై ప్రశంసల జల్లు కురిపించింది. ఆటపై వాట్సన్‌కున్న అంకితభావం గొప్పది, అతడు నిజమైన చాంపియన్‌ అంటూ సీఎస్‌కే ట్వీట్‌ చేసింది.
వాట్సన్ ఎంత అంకితభావం ఆటగాడో తెలుస్తుందని, అతడిపై గౌరవం పెరుగుతుందని సహచర ఆటగాడు హర్భజన్‌ సింగ్‌ కొనియాడాడు. ఒక వైపు రక్తం కారుతున్న పట్టించుకోకుండా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని భజ్జీ ప్రశంసించాడు. వాట్సన్‌ టీమిండియా లెజెండ్‌ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లేను గుర్తుచేశాడంటూ కొంతమంది గుర్తు చేశారు. కుంబ్లే కూడా ఓ టెస్టు మ్యాచ్‌ సందర్భంగా గాయపడితే. తలకు కట్టు కట్టుకొని మ్యాచ్‌ ఆడిన విషయం తెలిసిందే. ఇక సీఎస్‌కే ఫ్యాన్స్‌ కూడా వాట్సన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘మ్యాచ్‌ ఓడినా.. మా మనసులను గెలుచుకున్నావ్‌’, ‘సీఎస్‌కే అభిమానుల గుండెల్లో వాట్సన్‌కు ఎప్పుడూ స్థానం ఉంటుంది’ ‘సీఎస్‌కే అభిమాని అయినందుకు చాలా గర్వంగా ఉంది’ అంటూ సీఎస్‌కే అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు.

సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : 
గాయం లెక్క చేయకుండా.. బ్యాటింగ్‌ చేసిన వాట్సన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top