భారత జట్టు ఎంపిక రేపు | India's squads for Asia Cup and World T20 to be picked on Friday | Sakshi
Sakshi News home page

భారత జట్టు ఎంపిక రేపు

Feb 4 2016 12:32 AM | Updated on Sep 3 2017 4:53 PM

స్వదేశంలో జరిగే టి20 ప్రపంచకప్‌తో పాటు ఆసియాకప్ టి20 టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్ల ఎంపిక రేపు (శుక్రవారం) జరుగుతుంది.

ముంబై: స్వదేశంలో జరిగే టి20 ప్రపంచకప్‌తో పాటు ఆసియాకప్ టి20 టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్ల ఎంపిక రేపు (శుక్రవారం) జరుగుతుంది. సందీప్ పాటిల్ నేతృత్వంలోని భారత సెలక్టర్లు ఢిల్లీలో సమావేశమై జట్టును ఎంపిక చేస్తారు. ఆస్ట్రేలియాలో సిరీస్ విజయం సాధించిన జట్టులో సభ్యులంతా దాదాపుగా ఈ జట్లలోకి ఎంపికయ్యే అవకాశం ఉంది. టి20 ప్రపంచకప్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 15న న్యూజిలాండ్‌తో ఆడుతుంది. అలాగే ఆసియా కప్ ఫిబ్రవరి 24 నుంచి మార్చి 6 వరకు బంగ్లాదేశ్‌లో జరుగుతుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement