బెల్జియం చేతిలో భారత మహిళల ఓటమి | India's defeat at the hands of Belgium | Sakshi
Sakshi News home page

బెల్జియం చేతిలో భారత మహిళల ఓటమి

May 2 2014 12:26 AM | Updated on Sep 2 2017 6:47 AM

చాంపియన్స్ చాలెంజ్-1 హాకీ టోర్నీలో భారత మహిళల జట్టుకు మరో పరాజయం ఎదురైంది. పూల్ ‘ఎ’లో భాగంగా గురువారం బెల్జియంతో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 0-5 తేడాతో ఓటమిపాలైంది.

గ్లాస్గో: చాంపియన్స్ చాలెంజ్-1 హాకీ టోర్నీలో భారత మహిళల జట్టుకు మరో పరాజయం ఎదురైంది. పూల్ ‘ఎ’లో భాగంగా గురువారం బెల్జియంతో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 0-5 తేడాతో ఓటమిపాలైంది.
 
 ఆరంభంలో హోరాహోరీగా పోరాడి బెల్జియంను అడ్డుకున్న భారత మహిళలు 33వ నిమిషంలో మనన్ సైమన్స్ తొలి గోల్ సాధించినప్పటి నుంచి పట్టు కోల్పోయారు. బెల్జియం క్రీడాకారిణులు జిల్ బూన్ (38వ నిమిషం), లూయిస్ వెర్సవెల్ (41వ), ఎమ్మా పవ్రెజ్ (64వ), లీసెలోట్ వాన్ లింట్ (69వ)లు వరుసగా గోల్స్ నమోదు చేసి భారత్‌పై ఆ జట్టుకు తిరుగులేని ఆధిక్యాన్ని కట్టబెట్టారు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను శుక్రవారం అమెరికాతో ఆడనుంది.

Advertisement
 
Advertisement
Advertisement