కామన్వెల్త్ గేమ్స్లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది.
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. మంగళవారం భారత షూటర్ హర్ప్రీత్ సింగ్ రజత పతకంతో మెరిశాడు.
పురుషుల 25 మీటర్ల రాపిడ్ ఫైర్ పిస్టల్ హర్ప్రీత్ సింగ్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం సొంతం చేసుకున్నాడు. మరో విభాగంలో భారత షూటర్ గగన్ నారంగ్ పతకం రేసులో ఫైనల్స్కు చేరాడు.