కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత లిఫ్టర్ల జోరు కొనసాగుతోంది. పోటీల రెండో రోజు మంగళవారం భారత్‌కు ఐదు స్వర్ణ పతకాలు లభించాయి.
పుణే: కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత లిఫ్టర్ల జోరు కొనసాగుతోంది. పోటీల రెండో రోజు మంగళవారం భారత్‌కు ఐదు స్వర్ణ పతకాలు లభించాయి. సీనియర్ పురుషుల 77 కేజీల విభాగంలో సతీశ్ కుమార్ 325 కేజీలు బరువెత్తి పసిడి పతకాన్ని సాధించాడు. గతేడాది గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లోనూ సతీశ్ భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు. యూత్ పురుషుల 69 కేజీల విభాగంలో లాలూ టకూ (282 కేజీలు), యూత్ మహిళల 58 కేజీల విభాగంలో నుంగ్‌షిటాన్ (157 కేజీలు), జూనియర్ పురుషుల 77 కేజీల విభాగంలో కోజుమ్ తాబా (296 కేజీలు) కూడా భారత్‌కు పసిడి పతకాలు అందిచారు. సీనియర్ మహిళల 58 కేజీల విభాగంలో మినాతి (194 కేజీలు) కాంస్యం, 77 కేజీల జూనియర్ విభాగంలో అజయ్ సింగ్ (290 కేజీలు) రజత పతకం గెల్చుకున్నారు.