థాయ్ లాండ్ పై భారత్ విజయం | Indian eves assured of bronze in Uber Cup | Sakshi
Sakshi News home page

థాయ్ లాండ్ పై భారత్ విజయం

May 19 2016 7:23 PM | Updated on Sep 4 2017 12:27 AM

ఉబెర్ కప్ ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో భారత జట్టు పతకం ఖాయం చేసుకుంది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3-1 తేడాతో థాయ్లాండ్ ను ఓడించి సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది.

కున్‌షాన్ (చైనా): ఉబెర్ కప్ ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో భారత జట్టు పతకం ఖాయం చేసుకుంది. గురువారం  జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3-1 తేడాతో థాయ్లాండ్ ను ఓడించి సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తద్వారా కనీసం కాంస్య పతకాన్ని భారత్ తన ఖాతాలో వేసుకుంది.  తొలి మ్యాచ్లో భారత స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ 12-21,19-21 తేడాతో మాజీ వరల్డ్ చాంపియన్ రాచ్నోక్ ఇంతానాన్ చేతిలో పరాజయం చవిచూసింది.

 

అయితే మరో సింగిల్స్ మ్యాచ్లో పివి సింధు 21-18, 21-7 తేడాతో బుసానాన్పై గెలిచి స్కోరును 1-1గా సమం చేసింది. కేవలం 43 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్లో సింధు ఆకట్టుకుంది.  అనంతరం డబుల్స్లో భారత జోడి గుత్తా జ్వాలా, అశ్విని పొన్నప్పలు 21-18, 21-16 తేడాతో సప్సిరీ-టెరాట్టాన్ చాయ్పై గెలిచి ఆధిక్యాన్నిమరింత పెంచారు.  మరోపోరులో రుత్వికా శివానీ 21-18, 21-16 తేడాతో నిచోన్ జిందాపాల్పై విజయం సాధించడంతో భారత్ కు పతకం ఖాయమైంది.  2014లో  సెమీ ఫైనల్లో జపాన్ చేతిలో భారత్ ఓడి కాంస్య పతకంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో భారత్ వరుసగా రెండోసారి పతకం సాధించడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement